మాట్లాడుతున్న ఎస్సై శ్రవణ్ కుమార్ గౌడ్ ……

మత్తు పదార్థాల వల్ల యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు
… ఎస్సై శ్రవణ్ కుమార్ గౌడ్
స్టేషన్ ఘన్పూర్, జూన్ 06, ( జనం సాక్షి ): మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత తమ జీవి తాలను నాశనం చేసుకోవద్దని ఎస్సై శ్రవణ్ కుమార్ గౌడ్ అన్నారు. వరంగల్ నగర పొలీస్ కమీషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు స్టేషన్ ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సము ద్రాల గ్రామంలో చదువు,రోడ్డుప్రమాదాలుడయల్ 100, బాల కార్మికులు, బాల్య వివాహాలు, గుట్క, సైబర్ క్రైమ్ పై 1930 హెల్ప్ లైన్ గురించి,మూఢ నమ్మకాలు, గంజాయి, డ్రగ్స్,మత్తు పదార్థాల వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవ ద్దని, సామాజిక అంశాలపై పాటల ద్వార,4 G పై అవగాహన కల్పించడం జరిగింది. తెలంగాణ పోలీస్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, అవగాహన వారోత్సవాల సందర్భంగా ఏ హెచ్ టి యు, షీటీమ్స్,  చైల్డ్ లైన్ వారి ఆధ్వర్యంలో, కళా బృందంతో కలిసి పాల్గొని,వారి శాఖకు సంబంధిం చిన పలు అంశాలను వివరించారు.ఈకార్యక్రమం లో షీ టీమ్ సీఐ సాయిరమణ, షీ టీమ్ కి సంబం ధించిన ఎస్ ఐ, చైల్డ్ లైన్ సంబంధించిన అధికా రులు, గ్రామ సర్పంచ్,  స్టేషన్ ఘనపూర్ ఎస్సైలు శ్రవణ్ కుమార్, శ్రీనివాస్ ,జాగృతి కళాబృందం ఇంఛార్జి ఏఎస్ ఐ నాగమణి, సభ్యులు విలియ మ్, రత్నయ,విక్రమ్రాజు, నారాయణ, చిరంజీవి, శ్రీనివాస్ ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.