మాట్లాడుతున్న గుగులోతు వెంకట్
మానుకోటలో కాంగ్రెస్ గెలుపుకు సహకరించాలి
మహబూబాబాద్, నవంబర్ 11(జనంసాక్షి):
కాంగ్రెస్ కంచుకోట మానుకోటలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు ప్రజలు సహకరించాలని టీపీసీసీ ఎస్టీ సెల్ కార్యదర్శి గుగులోతు వెంకట్‌నాయక్ కోరారు. పట్టణంలోని గుమ్ముడూరులో సోమవారం ఈ మేరకు కమిటీని ఎన్నిక చేశారు. కమిటీ అధ్యక్షులుగా బత్తుల సారయ్య, ప్రధాన కారదర్శిగా గాడిపెల్లి వెంకన్నను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వెంకట్‌నాయక్ మాట్లాడుతూ గత అర్ధ శతాబ్ధకాలంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో గుమ్ముడూరు ప్రాంత ప్రజలు కీలకంగా వ్యవహరిస్తున్నారని, ఆదే జైత్రయాత్ర కొనసాగించేదుకు కమిటీని పునర్నిర్మాణం చేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధి ఎవరైనా ఐకమత్యంతో ప్రచారం నిర్వహించి గెలిపించుకోవాలని పార్టీ కార్యకర్తలను కోరారు. అనంతరం బత్తుల సారయ్య మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ అక్రమ పాలనకు చరమగీతం పాడాలన్నారు. ఎన్నికలబరిలో ఉన్న టీఆర్‌ఎస్, ఇతర పార్టీల నాయకులు ఓటమికి సిద్దంకావాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపే లక్ష్యంగా గుమ్ముడూరు కమిటి ఎల్లవేళలా సిద్దంగా ఉందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆరెంద్ర వెంకటేశ్వర్లు, కార్యదర్శి పోతురాజు రాజు, సహాయ కారదర్శి లింగాల వీరభద్రం, ప్రచార కార్యదర్శి పెండ్యాల శ్రీను, కోశాధికారి రేఖ చంద్రయ్య, కార్యవర్గ సభ్యులు తిప్పర్తి శ్రీధర్, పల్లపు ఉప్పలయ్య, సంపంగి రాంచంద్రు, తేజావత్ శంకర్, బోడ శ్రీను, మలికంటి గురుమూర్తి, గులగట్టు వేణు, తదితరులు పాల్గొన్నారు.