మాతాశిశు సంక్షేమమే ఐసిడిఎస్ లక్ష్యం
ఐసిడిఎస్ ఆర్‌జెడి ఆర్ సూయజ్
కందుకూరు ,జూలై 24,: మాతాశిశు సంక్షేమమే ఐసిడిఎస్ లక్ష్యం అని వారికి సేవలు అందించేందుకే ఐసిడిఎస్ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందని ఐసిడిఎస్ ఆర్‌జెడి ఆర్ సూయజ్ అన్నారు. సోమవారం పట్టణ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని రాంనగర్ ఏరియాలో మాతా శిశుసంక్షేమ చైతన్య వారోత్సవాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు, తల్లులు, గర్బవతులకు పౌష్టికాహారం అందించుటకు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వేలకోట్ల రూపాయలను కేటాయిస్తుందని ఐసిడిఎస్ సేవలను తల్లులు, గర్బవతులు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ చైతన్య వారోత్సవాల సందర్భంగా పౌష్టికాహార లోపం, రక్తహీనత వలన కలిగిఏ దుష్ఫలితాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, అదే విధంగా పోషకాహార లోపం వలన చిన్నారుల పెరుగుదల ఏ విధంగా ఆగిపోతుందో అవగాహన కల్పించబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపివో సులోచన, సూపర్‌వైజర్లు అంజమ్మ, శ్రీవల్లి, అంగన్‌వాడీ కార్యకర్తలు తల్లులు, చిన్నారులు, గర్బవతుల పాల్గొన్నారు.