మాతా శిశు మరణాల రేటుతగ్గిచాలి

నిర్మల్‌ అర్బన్‌,జనం సాక్షి:మాతా శిశు మరణాల రేటును తగ్గించాలని కుటుంబ సంక్షేమ శిక్షణ సంస్థ రాష్ట్ర సమన్వయకర్త  హొలివియా బెంజిమిన్‌ సూచించారు. పట్టణంలోని ప్రసూతి ఆస్పత్రిలో నర్సులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం పరిశీలించారు. మాతా శిశు మరణాల రేటును తగ్గిచండంలో భాగంగా నర్సులు,హెడ్‌ నర్సులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిశువుల మరణాలను తగ్గించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి ముందుకెళ్తోందని పేర్కొన్నారు. 24 గంటలు సేవలందించే ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి మెలకువలను వివరించేందుకు శిక్షణను ఇస్తున్న మాని వివరించారు. వైద్యు రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణను సద్వివినియోగం చేసుకోవాలని కోరారు.