మాతృభాషాభివృద్ధికి సర్కార్‌ దృఢ సంకల్పంతో ఉంది

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత భరద్వాజ సన్మాన సభలో సీఎం
హైదరాబాద్‌ ,మే 2 (జనంసాక్షి): మాతృ భాషాభివృద్ధికి సర్కార్‌ దృఢ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కు మార్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ రావూరి భరద్వాజను సీఎం సన్మానించారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించి జ్ఞాపి కలు అందజేశారు. ఈ సందర్భంగా రావూరి భరద్వాజకు రూ. 10 లక్షల నగదు పురస్కారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాను రాను తెలుగు భాష కనుమరుగవుతుందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మాతృభాషలోనే మాట్లాడాల్సిన అవసరముందన్నారు. తెలుగు భాష పరిరక్షణకు కవులు చేస్తున్న కృషి అభినందనీ యమన్నారు. జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ రావూరి భరద్వాజను సన్మానించడం తన అదృష్టం గా భావిస్తున్నానన్నారు.  ఈ సందర్భంగా సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌ సుభాష్‌గౌడ్‌ రావూరి భరద్వాజను సత్కరించారు. ఈ కార్యక్రమానికి వట్టి వసంత్‌కుమార్‌, డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి, నన్న పనేని రాజకుమారి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.