మాతృశ్రీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం,

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్23 (జనంసాక్షి);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని
ఉచితంగా టెస్టులు ఉచితంగా మందులు అందించారు,కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇంద్ర నగర్ కాలనీ 20వ వార్డు వనిత విద్యాలయంలో మాతృశ్రీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. మాతృశ్రీ ఉచిత వైద్య శిబిరంలో ఉచితంగా షుగర్ ,బీపీ, థైరాయిడ్, టెస్టులు చేసి ఉచితంగా మందులు అందించారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంగా న్యాయవాది మక్సుద్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రావణిక రెడ్డి సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాది మక్సుద్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఆర్థికంగా బాధపడుతున్న చాలా కుటుంబాలలో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావించే మీకు మేము అండగా ఉంటామని తన వంతు సహాయంగా తమ హాస్పిటల్ యందు ఒకవేళ మీకు ఆడపిల్ల పుట్టినట్లయితే డబ్బులు తీసుకోకుండా ఉచితంగా కాన్పు చేయడానికి ముందుకు రావడం డాక్టర్ శ్రావణిక రెడ్డి గొప్పతనమని అన్నారు. మహిళల బాధలంటే ఏంటో ఆమెకు తెలుసు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తున్నానని తెలిపారు. ఆదివారం ఉచిత వైద్య శిబిరంలో 300 నుండి 400 వరకు వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి తన వంతుగా నలుగురికి మగబిడ్డ పుడితే అయ్యే ఖర్చులు తానే భరించుకుంటానని తెలిపారు. ఉచిత వైద్య శిబిరం సందర్భంగా అదివారం ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న వారందరికీ సౌత్ సెంట్రల్ రైల్వే రమేష్ జ్యూస్ స్పాన్సర్ చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ శ్రావణిక రెడ్డి మాట్లాడారు ఉచిత వైద్య శిబిరంలో గర్భిణీలు ,మహిళలు ,వృద్ధులు కూడా రావడం జరిగిందని. గర్భిణీ వాళ్లకు కొంతమం వుదికి థైరాయిడ్ కూడా ఉందని. బిపి షుగర్ పేషంట్స్ వారు కూడా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టి యు యు సౌత్ సెంట్రల్ రైల్వే రమేష్, గోపాలరావు, భోగి రవి, ఆంజనేయులు, భాస్కర్ రావు, అర్జున్, ఈశ్వర్, ఫిరోజ్ ఖాన్, మాతృశ్రీ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.