*మాదిగలకు ప్రధాన శత్రువు బిజెపి ప్రభుత్వం*

మునగాల, జూలై  (జనంసాక్షి): ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ పిలుపు మేర మునగాల మండల కేంద్రంలో బిజెపి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను మంగళవారం దగ్ధం చేయడం జరిగినది. అనంతరం మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా నాయకులు కొత్తపెల్లి అంజయ్య మాదిగ, మునగాల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లంజపల్లి శ్రీను మాదిగలు మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అధికారంలోకి
వస్తే 100 రోజుల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి నేటికీ 8సంవత్సరాలు గడుస్తున్నా గాని చట్టబద్ధత కల్పించకుండా మాదిగలను మోసం చేస్తుందని, బిజెపి పార్టీ జాతీయ సమావేశాలలో ఎమ్మార్పీఎస్ నాయకులు  వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని శాంతియుతంగా నిరసన చేస్తుండగా బిజెపి ఆర్ఎస్ఎస్ నాయకులు గుండాలుగా వ్యవహరించి బలంగా వారిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మేమే గెలుస్తామని పగటి కలలు కంటున్న బిజెపి నాయకులను మాదిగ పల్లెలో అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో బిజెపి పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని హెచ్చరిస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోని వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ చేసేంతవరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నడిగూడెం మండల ఇంచార్జ్ మిట్టగనుపుల మోష, ఎమ్మార్పీఎస్ నాయకులు లంజపల్లి అర్జున్, కత్తి శ్రీనుమాదిగ, లంజపల్లి రాజేష్, అశోక్, తిరపయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.