మాదిగల నమ్మక ద్రోహి బీజేపీ
ఈర్ల కుమార్ మాదిగ
– వరంగల్ తూర్పు కోఆర్డినేటర్
వరంగల్ 18వ డివిజన్ క్రిస్టియన్ కాలనీ లో కుల పెద్దల ఆధ్వర్యంలో జులై 2న సడక్ బంధును కరపత్రం ఆవిష్కరరించి ఇంటింటికి కు కరపత్రాలు పంచడం జరిగింది .దీన్ని ఉధ్యేశించి ఈర్ల కుమార్ మాదిగ మాట్లాడుతూ యస్సిల వర్గీకరణ సుధీర్గమైన పోరాటంలో బీజేపీ మద్దతు ఇస్తూ మేము కేంద్రంలో అధికారం వస్తే వందరోజులు వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చింది రెండు సార్లు కేంద్రంలో అధికారం వచ్చినా వర్గీకరణ చేయకపోవడం మాదిగ జాతిని మోసం చేసిందని, జులై 2,3న హైదరాబాద్ లో బీజేపీ పెద్దలు వస్తున్నారు మా వర్గీకరణ విషయం లో స్పష్టత ఇవ్వకుండా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి మాదిగల ఎవ్వరు వెళ్లారన్నారు. కాలనిలోని ప్రతి మాదిగ కుటుంబం నుండి తరలి వచ్చి సడక్ బంధును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు .సంగిభావం తెలుపుతూ 18వ డివిజన్ కార్పొరేటర్ వస్కుల బాబు మాట్లాడుతు రేపు జరుగుతున్నా యస్ ల వర్గీకరణ పోరాటం లో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం వైకరిని నిరసిస్తూ జులై 2న సడక్ బంధును అత్యధికంగా కాలనీ ప్రజలు హాజరై విజవంతం చేయాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో కలకొట్ల గిరి మాదిగ, గంగారపు మల్లన్న మాదిగ, సంగిభావం తెలుపుతున్నా కుల పెద్దలు బోట్ల సదానందం మాజీ కార్పొరేటర్ , బైరిపాక డేవిడ్ రాజ్ తెరాస నేత,సందేలా లాజర్ కాంగ్రేస్ పార్టీ నేత ,కొమ్ము సుధాకర్, కంజర్ల జాకబ్, జన్ను జేమ్స్, దుగ్గిల దాస్, జన్ను శ్రీను, గబ్బేటా కిరణ్, జన్ను సురేష్, రెడ్డి రమేష్, కంజర్ల పవన్, పోలేపాక అజయ్, మడిపల్లి అమృతరావు పాలుగోన్నారు