మానవత్వం చాటుకున్న విశ్వకర్మ మెకానిక్ సంఘం

ఆకాంక్ష కాలేయం చికిత్స కై 25వేలు ఆర్థిక సాయం.
ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు అభిప్రాయం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి న్యూస్, జులై 28(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా విశ్వకర్మ మెకానిక్ సంఘం సభ్యులు చిన్నారి బేబి ఆకాంక్ష కు లివర్ చికిత్స కొరకు 25వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకు న్నారు.నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన రాజు కుమార్తె బేబీ ఆకాంక్ష (6)గత కొద్ది రోజులుగా కాలేయం వ్యాధి తో ఇబ్బంది పడుతుందని ఆకాంక్ష తండ్రి రాజు తెలిపా రు.తన కుమార్తె ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రతిమ ఆసుపత్రిలో కాలేయం మార్పిడి కోసం చికిత్స పొందుతుందని, కాలేయం మార్పిడి శస్త్రచికిత్స కొరకు 25లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారని,శస్త్ర చికిత్స ఆగష్టు నెల లో జరుగుతుందని, కావునా ఆర్థిక సామర్థ్యం లేకపోవడం వల్ల నిధులు సేకరి స్తున్నానని తెలిపారు.దానిలో భాగంగానే గురువారం విశ్వకర్మ మెకానిక్ సంఘం తరఫున బేబీ ఆకాంక్ష లివర్ మార్పిడి శస్త్రచికిత్స కొరకు తన తండ్రి అయిన రాజు చారి కి 25 వేల రూపాయలు అందజేయ డం జరిగింది. విశ్వకర్మ సంఘం చేసిన ఆర్థిక సహాయాన్ని పలువురు పట్టణ ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ మెకానిక్ సంఘం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు రాసోజు సురేందర్ చారి, మరియు ప్రధాన కార్యదర్శి బండి కట్ల సతీష్ చారి,కోశాధికారి కపిలవాయి శ్రీనివాసులు చారి,నరేష్ చారి, టి.రామాచారి,ఆందోజు నరేంద్రాచార్యులు , దామోజు విష్ణు చారి, మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సహృదయంతో చిన్నారి బేబీ ఆకాంక్ష కాలేయం మార్పిడి శస్త్రచికిత్స కొరకు ఆర్థికంగా, ప్రభుత్వం నుండి ఆదుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.