మానవ అక్రమ రవాణా అరికడదాం
లింగాల జనం సాక్షి ప్రతినిధి,
లింగాల మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామంలో గురువారం శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ ము సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ వి కె మండల కోఆర్డినేటర్ శ్రీనివాసులు మాట్లాడుతూ అక్రమ రవాణా అంటే తమ ప్రమేయం లేకుండా ఒక వ్యక్తిని ఒక ప్రాంతం నుంచి మరోక ప్రాంతానికి తరలించడాన్ని అక్రమ రవాణా అంటారు .ఇవి ఎక్కువగా బంధువులు, చుట్టుపక్కల వారు, స్నేహితులు మరియు బాగా తెలిసిన వారు చేస్తుంటారు అక్రమ రవాణాకు గురైన టువంటి వ్యక్తుల చేత బలవంతపు శారీరకశ్రమ, అవయవ అక్రమ రవాణా, మత్తు పదార్థాల విక్రయం, వ్యభిచార గృహాలకు తరలించడం మరియు ప్రమాదకర పరిశ్రమల్లో పని చేయించడం జరుగుతుంది .దీనికి ఎక్కువగా గురి అయ్యే వ్యక్తులు ప్రథమంగా పిల్లలు తర్వాత సామాజికంగా వెనుకబడిన కులాల వారు అందులో మరీ ముఖ్యంగా మహిళలు ఉంటారు పిల్లల విషయానికి వచ్చినప్పుడు ఇంటి నుండి పారిపోయిన పిల్లలు, తప్పిపోయిన పిల్లలు, కిశోర బాలికలు ప్రేమ పెళ్లి ద్వారా మోసపోయే పిల్లలు, వీధి బాలలు, అనాధ పిల్లలు, లైంగిక వేధింపులకు గురి అయ్యే కుటుంబాల పిల్లలు
సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఉపయోగించుకునే పిల్లలు .మొదలగు పిల్లలు ఎక్కువగా అక్రమ రవాణా కు గురవుతుంటారు మన గ్రామీణ ప్రాంతాల్లో వలస ప్రాంతంలో, ఇటుక బట్టీల లో, సీజనల్ వ్యవసాయ కూలీ పనులలో, వెట్టిచాకిరీ పనులలో, ఇళ్ళల్లో పని చేస్తున్న పిల్లలు అక్రమ రవాణాను గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కావున మీరందరూ అప్రమత్తంగా ఉండి హెల్ప్ లైన్ నెంబర్స్ ను విరివిగా ఉపయోగించు కొని ట్రాఫి కర్స్ నుండి తప్పించుకోవాలని ఈ సందర్భంగా 1098,100 మరియు 181 నెంబర్స్ ను ఉపయోగించు కావాలని తెలియ జేశారు ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ పర్వతాలు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మొగిలి మహేష్
గ్రామ మాజీ సర్పంచ్ బళ్లారి భోజ్యయ ఎస్ వి కే కమ్యూనిటీ ఆర్గనైజర్లు మన్సూర్ తదితరులు ఉన్నారు.