మానసిక బలహీనతతోనే దురలవాట్లు.
సైకాలజిస్ట్ పున్నం చందర్.
సిరిసిల్ల. నవంబర్ 10. (జనం సాక్షి). మానసిక బలహీనతతోనే దురలవాట్లకు లోనవుతారని సైకాలజిస్ట్ పున్నం చందర్ అన్నారు. గురువారం మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో పట్టణంలోని గణేష్ నగర్ లో కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో సైకాలజిస్ట్ పున్నం చందర్ మాట్లాడుతూ మానసిక బలహీనతతోనే దురలవాట్లకు లోనవుతున్నారని అన్నారు. సమస్యలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. దురలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో మనో వికాస కేంద్రం సిబ్బంది వేముల అన్నపూర్ణ, రాపల్లి లత ,బూర శ్రీమతి ,కొండ ఉమా కార్మికులు పాల్గొన్నారు.