మాపై పెత్తనం ఇంకానా?

2

– రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు

హైదరాబాద్‌,జూన్‌ 6(జనంసాక్షి): న్యాయాధికారుల నియామకాలను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళన ఉద్థృతం చేశారు. వీరి నియామకాల్లో అన్యాయం జరిగిందని నిరసిస్తూ కోర్టులను బహిస్కరించి పోరుకు దిగారు. ఈ మేరకు  విధులు బహిష్కరించి నాంపల్లి కోర్టు ముందు ఆందోళన చేపట్టారు. కోర్టుకు తాళాలు వేసి న్యాయమూర్తులతో సహా ఉద్యోగులు ఎవరినీ లోనికి పోకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ న్యాయమూర్తుల నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని లాయర్ల జెఎసి నాయకుడు రంగారావు ఆరోపించారు. తెలంగాణలోని పది జిల్లాల్లో కోర్టులకు తెలంగౄణ జడ్జిలనే నియమించాలని అన్నారు. హైకోర్టులో కూడా తెలంఆన వ్యక్తే రిజిస్ట్రార్‌గా ఉండాలన్నారు. రాషట్‌రం విడివడ్డాక కూడా ఇంఆ ఆంధ్రా పెత్తనం కొనసాగుతోందని ఆయన అన్నారు.

ఇంతకన్నా దారుణం లేదన్నారు. జెఎసి పిలుపు మేరకు  తెలంగాణవ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. సీమాంధ్రకి చెందిన న్యాయమూర్తులు ఆప్షన్‌ విధానం ద్వారా తెలంగాణలో పని చేయడాన్ని నిరసిస్తూ వాళ్లు నిరసన తెలుపుతున్నారు. ఆప్షన్‌ విధానాన్ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటు చేసుకొని ఆంధ్ర న్యాయమూర్తులు అక్కడికి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. 42 మంది ఆంధ్ర న్యాయమూర్తులని తెలంగాణలో నియమించాలన్న కుట్రలను మానుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. రంగారెడ్డి కోర్ట్‌ల సముదాయం ఎదుట విధులను బహిష్కరించిన న్యాయవాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దీనికి నిరసనగా ఈనెల 13న చలో హైకోర్టు తలపెట్టినట్లు ప్రకటించారు. తెలంగాణ హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని, ప్రతి న్యాయవాదికి ఆరోగ్య భద్రతా కార్డుతో పాటు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా చేస్తున్న న్యాయాధికారుల కేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం న్యాయాధికారులు, న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసనలకు దిగారు. వరంగల్‌ జిల్లా కోర్టులో విధులు బహిష్కరించిన న్యాయవాదులు న్యాయస్థానం ముందు బైఠాయించారు. నాంపల్లి కోర్టులో విధులు బహిష్కరించిన న్యాయవాదులు నిరసన చేస్తున్నారు.