మాయలేడీగా నయీం

5

– వేషాలు మార్చి మోసాలు

– నరహంతక నయీంపై వెల్లువెత్తున్న ఫిర్యాదులు

హైదరాబాద్‌,ఆగస్టు 13(జనంసాక్షి): గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో ఇపస్పటి వరకు 20మందిని అరెస్ట్‌ చేశామని సిట్‌ ఐజి నాగిరెడ్డి తెలిపారు. అలాగే లభించిన ఆధారాల మేరకు దర్యాప్తు సాగుతోందన్నారు. నయీం తన కార్యకాలపాలను నిర్వహించేందుకు మారు వేశాలలో సంచరించేవాడని కూడా చెప్పారు. ఈ మేరకుకొన్ని ఫోటోలను విడుదల చేశారు. వేషధారణ మార్చి అమ్మాయిల రూపంలోనూ, అనేక వేషాల్లో తిరిగాడని  సిట్‌ చీఫ్‌ నాగిరెడ్డి తెలిపారు. శనివారం రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్లో సిట్‌ బృందం సమావేశనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ….అమ్మాయిల వేషధారణలో నయీం తిరిగిన ఫోటోలను త్వరలో విడుదల చేస్తామన్నారు. నయీం ఆగడాలపై సిట్‌ కంట్రోల్‌ రూమ్‌కు  శనివారం ఒక్కరోజే 60 ఫిర్యాదులు అందాయని నాగిరెడ్డి చెప్పారు. బాధితులను స్థానిక పీఎస్‌లో  ఫిర్యాదు చేయమని సూచించమన్నారు. ఈ కేసులను సిట్‌కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. నాలుగు హత్య కేసుల్లో నయీం ప్రధాన నిందితుడిగా ఉన్నాడన్నారు. నదీం అలియాస్‌ ఉదయ్‌ కుమార్‌, నస్రీన్‌, హీనా, చియాన్ల అదృశ్యం వెనుక నయీం హస్తముందన్నారు. ఇప్పటి వరకు ఈ కేసుల్లో ఏలాంటి ఫిర్యాదులు కూడా అందలేదన్నారు. మహిళలను, చిన్నారులను మానవకవచాలుగా నయీం వాడుకున్నాడని ఆయన తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నయీంకు చెందిన 20 ఇళ్లు గుర్తించామని…ఆ ఇళ్లల్లో సోదాలకు కోర్టు అనుమతి కోరుతున్నామన్నారు.  నయీం ప్రధాన అనుచరులు టెక్‌ మధు, కుమారస్వామిలను శుక్రవారం అరెస్టు చేశామని…నయీం వ్యవహారాల్లో వీరిద్దరూ కీలకమన్నారు.  నయీం ఆస్తులపై శుక్రవారం విలువైన సమాచారం అందిందన్నారు. కోరుట్ల, కరీంనగర్లో నాలుగు బెదిరింపు కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. నయీం నేరాలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదులు, సమాచారం ఇవ్వదలచిన వారు 94406 27218 నంబర్కు సంప్రదించవచ్చునని నాగిరెడ్డి తెలిపారు.ఇకపోతే ప్రస్తుతం తెలంగాణలోనే విచరాణ సాగిస్తున్‌ఆనమని, ఇతర ప్రాంతాల్లో కేసులపై తరవాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇదిలావుంటే నయీం కేసును దర్యాప్తు చేస్తున్నకొద్ది రోజుకో విషయం బయటపడుతుంది. సోదాల్లో మారువేశంలో, ఆడవేశంలో నయీం సంచరించినట్లు ఆధారాలు లభించాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకు వెళ్లే సమయంలో ఆడవేశంలో, మారువేశంలో, చిన్న పిల్లలతో, కుటుంబ సభ్యులతో వెళ్లేవాడని నయీం అనుచరులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. నయీం కేసుపై దర్యాప్తు అధికారి నాగిరెడ్డి కేసుకు సంబంధించిన వివరాలు విూడియాకు తెలిపారు. నయీంనాలుగు హత్య కేసుల్లో నయీంను ప్రధాన నిందితుడిగా ఉన్నాడని,  ఇప్పటి వరకు ఈ కేసుల్లో ఏలాంటి ఫిర్యాదులు కూడా అందలేదన్నారు.

వెలుగు చూస్తున్న నయీం అక్రమాలు

గ్యాంగ్‌స్టర్‌ నయీం భూ దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వీటన్నటిపైనా సిట్‌ దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తోంది.  తాజాగా ఓ హీరోయిన్‌ స్థలాన్ని నయీం కబ్జా చేసినట్లు తెలుస్తోంది. నానక్‌ రాం గూడ ప్రాంతంలోని ఆరు ఎకరాల స్థలాన్ని అతడు స్వాధీనపరచుకున్నట్లు సమాచారం. అలాగే రంగారెడ్డి జిల్లా చార్టెడ్‌ అకౌంటెంట్‌ హత్యకేసులో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. నయీంకు కొంతమంది పోలీసులు సహకరించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలోని ఓ ఐపీఎస్‌ అధికారి పాత్రపై సిట్‌ దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ దందా చేసేందుకు నయీం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రతిగా రూ.5 కోట్లు అతడు చెల్లించినట్లు సమాచారం. వికారాబాద్‌లో నయీంకు 15 ఎకరాలు ఫాంహౌస్‌ను సిట్‌ అధికారులు గుర్తించారు. అలాగే దుర్గామాత సొసైటీలో 60 ప్లాట్లు నయీం కబ్జా చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ పోలీస్‌ అధికారికి శంషాబాద్‌లో  భూమి ఉందని,  ఆ పోలీస్‌ అధికారి ఈ లావాదేవీలను దగ్గరుండి నడిపించినట్లు సమాచారం. ఆ అధికారికి శంషాబాద్లో షాపింగ్‌ కాంప్లెక్‌స్తో పాటు 10 ఎకరాల్లో ఫంక్షన్‌ హాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మెదక్‌ జిల్లాలో న్యాయవాది హత్య  వెనుక నయీం హస్తమున్నట్లు తెలుస్తుంది. రెండెకరాల స్థల వివాదంలో అతడికి పోలీసుల మద్దతు ఉందని, నయీం సహకారంతో కొందరు పోలీసులు మంచి పోస్టింగ్లు పొందినట్లు తెలుస్తుంది. వీటన్నింటిపైనా సిట్‌ దృష్టిపెట్టింది. ఆరోపణలు ఉన్న పోలీసులు, నేతలపై విచారణ ఎలా సాగాలన్నదానిపై సిట్‌ సమావేశమైంది.