*మార్క్సిజం- లెనినిజం- మావో ఆలోచనా విధానం వర్ధిల్లాలి*
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 9 (జనం సాక్షి);
మార్క్సిస్టు మహూపాధ్యాయుడు
కామ్రేడ్ మావో 46 వర్ధంతిని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కేంద్రంలోని సిపిఐఎంఎల్ న్యూడెవెూక్రసీ పార్టీ కార్యాలయంలో న్యూడెమోక్రసీ – పి డి ఎస్ యు ఆధ్వర్యంలో మావో చిత్ర పట్టనికి నివాలర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా సి పి ఐ ఏం ఎల్ న్యూడెవెూక్రసి పార్టీ జిల్లా ఇంచార్జ్ గంజిపేట రాజు మాట్లాడుతూ మార్క్సిస్టు మహూపాధ్యాయుడు కామ్రేడ్,మావో 1976 సెప్టెంబర్ 9న మరణించి నేటికి 46
సంవత్సరాలు గడిచాయనీ,చైనా విముక్తి ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించి భారతదేశ అర్ధవలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థ మారాలంటే ప్రతిఘటనా పోరాట మార్గంలో పయనించాలన్నాడన్నారు. నూతన ప్రజాస్వామిక విప్లవం లక్ష్యంగా పనిచేయాలన్నారు. దేశంలో మతోన్మాద బి జె పి ప్రభుత్వం కార్మిక చట్టాలను, అడవీ సంరక్షణ చట్టాన్ని సవరణ పేరుతో దేశ సంపదను కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలను తిప్పికొట్టాలన్నారు. దేశంలో, రాష్ట్రంలో రోజురోజుకీ నిత్యవసర ధరలు పెరిగి
పోతున్నాయన్నారు. పన్నులభారం, అధిక ధరలతో ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేదన్నారు. రైతాంగం పంట పెట్టుబడి పెరిగి, గిట్టుబాటు ధరలు లేక, పంట రుణాలు మాఫీ అవ్వక, కొత్త రుణాలు ఇవ్వక తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం యువత ఉద్యమాలకు సిద్దం కావాలన్నారు.
కామ్రేడ్ మావో చూపిన మార్గంలో భూమి,భుక్తి,
విముక్తి కోసం జరుగుతున్న ప్రతిఘటనా పోరాట మార్గంలో ప్రజలు సమసమాజ స్థాపనకై తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు హైమద్ ఖాన్, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు వంశి కుమార్,జిల్లా నాయకులు మన్యం,రాజు కుమార్,మనోహర్, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు వెంకటేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area