మార్చి 7నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

1
హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జనంసాక్షి): తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు  మార్చి 7 నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 2015-2016 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ మధుసూదనాచారితో సీఎం కేసీఆర్‌ సమావేశమై చర్చించారు. మార్చి 7 నుంచి 27 వరకు సమావేశాలు జరగనున్నాయి.

మార్చి 7న గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. తర్వాత మార్చి 8 నుంచి 10 వరకు గవర్నర్‌ ప్రసంగానికి సభ ధన్యవాదాలు తెలుపుతుంది. మార్చి 11న సభకు బడ్జెట్‌ సమర్పిస్తారు.  మార్చి 17న బడ్జెట్‌పై ప్రభుత్వ సమాధానం ఇవ్వనుంది. కాగా 12,15,21,22 తేదీల్లో అసెంబ్లీకి సెలవు దినాలు.