మావోయిస్టులతో చర్చలకు సిద్ధం
– కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్
విశాఖపట్టణం,ఫిబ్రవరి 19(జనంసాక్షి): రాజ్యాంగ పరిధిలో మావోయిస్టులతో చర్చలకు సిద్ధమని కేంద్ర ¬ంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. దేశంలో వామపనక్ష తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందని అన్నారు. అయితే వామపక్షవాదులు దేశా అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందన్నారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రాజ్‌నాథ్‌సింగ్… ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఏపీ, ఒడిశాలో మావోయిస్టుల ప్రభావం తగ్గిందన్నారు. మావోయిస్టు భావజాలం ఉన్నవారు దేశాభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నక్సల్స్ సమస్యపై ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని రాజ్‌నాథ్ అన్నారు. నక్సల్స్ హింసను వీడి, ప్రజాజీవితంలో కలిసిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకవేళ నక్సల్స్ ఆయుధాలను వీడితే, రాజ్యాంగ నియమావళి ప్రకారమే వారితో చర్చలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తుందని, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఆయన కోరారు. పేదలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని రాజ్‌నాథ్ అన్నారు. ఒడిశా, ఏపీ రాష్ట్రాల పోలీస్ అధికారులతోనూ కేంద్ర మంత్రి సవిూక్ష సమావేశం నిర్వహించారు. విశాఖ, ఒడిశాలో పర్యటించిన అనంతరం శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఏపీ, ఒడిశాలో వామపక్ష తీవ్రవాదంపై విశాఖలో సవిూక్ష నిర్వహించామని అన్నారు. దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదం తగ్గిందని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టులు హింసావాదం వీడి జనజీవన సవంత్రిలో కలవాలని రాజ్‌నాథ్ సింగ్ పిలుపు ఇచ్చారు. రాజ్యాంగ పరిధిలో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.