మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కడం మండలంలో పర్యటించిన
నిర్మల్ బ్యూరో, ఆగస్టు30, యువతీ, యువకులు మావోయిస్టుల మాయలో పడకుండ జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ సిహెచ్.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కడం మండలంలోని గండిగోపాల్ పూర్, గండి గూడం, కట్టకింది గూడం, మిద్ద్య చింతల్ మరియు ఉడుంపూర్ గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇటీవల ఈ గిరిజన ప్రాంతాల్లో మావోయిస్ట్ లు సంచారిస్తున్నట్లు తెలిసిందని, కావున యువతీ, యువకులు మావోయిస్టు/తీవ్రవాద కార్యకలాపాలకు దోహదపడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదు. ఈ ప్రాంతంలో మావోయిస్టు దళ సభ్యులు కదలికలు ఉన్నట్లు దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలకు, ఆదివాసి ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న నిర్మల్ జిల్లాలో మావోయిస్టుల విప్లవ రాజకీయాలకు, హింసా పూరిత కార్యక్రమాలకు తావులేదు. గతంలో అనుభవించిన చెడు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని ఆదిలోనే మావోయిస్టుల ఆగడాలకు ఉనికికి అడ్డుకట్ట వేయండి. ప్రజలకు ఏ సమస్యలు ఉన్న ప్రభుత్వం, పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని, గ్రామస్థులు ఎస్పీ గారికి పలు సమస్యలు విన్నవించారు, పోలీసులు మీకోసం కార్యక్రమం ద్వారా జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మీ ప్రాంత సమస్యలు జిల్లా పాలనాదికారితో చర్చించి, పరస్పర సహకారంతో సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలి లేదా డయల్ 100 కీ కాల్ చేసి తెలియజేయాలని కోరారు. తెలిపిన వారి వివరాలు రహస్యంగా ఉంచబడుతాయని మరియు వారికి తగిన బహుమతి ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. అనంతరం ఆయా ప్రాంతాల పాఠశాల చిన్న పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్ అందించారు .
ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి, ఖానాపూర్ సి.ఐ అజయ్ బాబు, కడం ఎస్.ఐ రాజేష్, సర్పంచ్, పటేల్స్, గ్రామస్థులు, యువకులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.