మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు.

వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్సై నరేష్.
వేమనపల్లి, అక్టోబర్9,(జనంసాక్షి)
ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ గారి పర్యవేక్షణలో ఆదివారం నీల్వాయీ ఎస్సై నరేష్ తన సిబ్బంది మరియు స్పెషల్ పోలీసు సిబ్బంది తో కలిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒడ్డుగుడెం, నాగారం గ్రామాల శివారు లోని ఫెర్రీ పాయింట్స్, బ్రిడ్జ్స్, కల్వర్ట్ లను తనిఖీ చేశారు. జక్కేపల్లి గ్రామం గుండా ఏరియా డామినేషన్ చేస్తూ ఆ మార్గాలలో వెళ్లే వాహనాలను ఆపి ఆకస్మికంగా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానితుల ఆధార్ వివరాలు, వారు ఎక్కడ పని చేస్తున్నారు, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు, ఏక్కడ నివాసం ఉంటున్నారని వివరాలను సేకరించారు. సరైన వివరాలు తెలుపనటువంటి అనుమానస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు.
ఈ సందర్భంగా నీల్వాయి ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వారు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, ఆటోలలో పరిమితికి మించి ప్యాసింజర్స్ ను ఎక్కించుకోకూడదని, ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు, ఆర్ఓపీ, ఏరియా డామినేషన్ నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా మీ నివాస ప్రాంతాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించినట్లయితే స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని సమాచారం అందించి వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.