మాస్టర్‌ఏ34000
కోల్‌కత్తా, డిసెంబర్ 5: ప్రపంచ క్రికెట్‌లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మాస్టర్ బ్లాస్టర్‌సచిన్ టెండూల్కర్ మరో అరుదైన మైలురాయి అందుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 34 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో కోల్‌కత్తా వేదికగా ప్రారంభమైన మూడో టెస్టులో మాస్టర్ ఈ ఘనత సాధించాడు. స్పిన్నర్ మాంటీ పనేసర్ బౌలింగ్‌లో రెండో పరుగు సాధించడం ద్వారా కెరీర్‌లో సచిన్ 34 వేల పరుగులను అందుకున్నాడు. టెండూల్కర్ సవిూపంలో ఎవ్వరూ లేకపోవడం విశేషం. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 27 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 23 ఏళ్ళ సుదీర్ఘ కెరీర్‌లో సచిన్ ఎన్నో రికార్డు లు తన ఖాతాలో వేసుకున్నాడు. 192 టెస్టుల్లో 15560, 463 వన్డేల్లో 18426 పరుగులు సాధిం చాడు. అటు ప్రపంచ క్రికెట్‌లో వంద సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ కూడా మాస్టరే. అయితే గత కొంత కాలంగా వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ మొదలైన కోల్‌కత్తా టెస్టులో నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. దాదాపు 11 ఇన్నిం గ్స్‌ల తర్వాత సచిన్ హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో సచిన్ చివరిసారిగా 2011లో సౌతాఫ్రికాపై శతకం నమోదు చేశాడు. కాగా ఇవాల్టి మ్యాచ్‌లో టెండూల్కర్ 76 పరుగులు చేసి ఔటయ్యాడు.