మా కోటా నీళ్లు ఎక్కడైనా వాడుకుంటాం

5

రాష్ట్రాల వారిగా నీటి విభజన జరగాలి

– ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌ రావు

హైదరాబాద్‌, ఫిబ్రవరి1,(జనంసాక్షి): ప్రాజెక్టుల వారీగా కాకుండా రాష్గాల వారీగా నీటి కేటాయింపులు జరగాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… జూరాల నుంచి సాగర్‌ వరకు ఉన్న 481 టీఎంసీల్లో 281 ఏపీకి, 200 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉందన్నారు. రెండు రాష్గాల మధ్య నీటి వాటా 811 టీఎంసీలు అని వివరించారు. విభజన చట్టం ప్రకారం 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయన్నారు. వాటాల జోలికి పోవొద్దని ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు చెబుతుందో అర్థం కావట్లేదన్నారు. పంపకాలు జరగకుంటే నీటి వినియోగం ఎలా సాధ్యమని విద్యాసాగర్‌రావు ప్రశ్నించారు