మా తెలంగాణే పెట్టుబడులకు అనుకూలం
-
ఏరో ఇండియా సదస్సులో జూపల్లి కృష్ణారావు
బెంగుళూరు,ఫిబ్రవరి20(జనంసాక్షి): భాతదేశ రక్షణ రంగంలో ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్యంలో దేశం స్వావలంబన సాధించి మేక్ ఇన్ ఇండియా విధానం విజయవంతంగా సాధించాలని పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులకు 49శాతం వరకు అనుమతించినందున చిన్న,మద్యతరహాల పరిశ్రమలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆన్నారు. ప్రస్తుత రక్షణ రంగం 60శాతం దిగుమతులపై ఆధారపడినందున దేశీయ పరిశ్రమలు తమ సాంకేతికి నైపుణ్యాలను అభివృద్ది పరుచుకొని దేశము స్వావలంబన సాధించగలవని అన్నారు. దేశంలో రక్షణ ఉత్పత్తులకు హైదరాబాదు కేంద్రంగా ఉన్నందున దేశ విదేశ సంస్థలు తమ పరిశోధన, అభవృద్ది కార్యక్రమాలకు హైదరాబాద్‌ను వేదికగా మలుచుకోవాలని కోరినారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం ప్రకటించి పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేలా ఆదేశించారని, పరిశ్రమలకు ప్రపంచంలో ఎక్కడలేని విధంగా ప్రోత్సహాకాలు ప్రకటించినందున పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుటకు రావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి డా.ప్రదీప్‌చంద్ర ,పరిశ్రమల శాఖ కవిూషనర్ జయేష్‌రంజన్ లతో కలసి ఆయన ఐఎస్ బెంగుళూరులో జరుగుతున్న ఏరో ఇండియా-2015 ప్రదర్శనలో పాల్గోన్నారు. ఈసందర్భంగా సిఐఐ వారు రక్షణ , వైమానిక రంగంలో భారతీయ చిన్న మధ్యతరహా పరిశ్రమలను బలోపేతం చేసే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశ్రామిక ప్రగతికి తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక కార్యదర్శి నూతన పారిశ్రామిక విధానంపై పెట్టుబడిదారులకు పవర్
పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తదుపరి మంత్రి తెలంగాణా పరిశ్రమల శాఖా ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించి , బ్రిటన్ దేశానికి చెందిన ఎడియస్ సంస్థ ప్రతినిధులతో వైమానిక, రక్షణ రంగంలో ఈకో-సిస్టమ్ అభివృద్ది పరుచుటకు ఎమ్‌ఓయు కుదుర్చుకున్నారు. ఇజ్రాయిల్ , ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతినిధులు ఆయా దేశాల పరిశ్రమల వారితో సమావేశమయ్యారు. . అదేవిధంగా ఎయిర్‌బస్, ధేల్స్, సాఫ్రాన్, ఎరోస్పేస్, ఏక్సిన్ కోడ్సు ప్రతినిధులతో తెలంగాణాలో పరిశ్రమల స్థాపనకుగల అవకాశాలను చర్చించారు.