మా ప్రాజెక్టులు న్యాయబద్దమైనవి

4

– జలవనరుల కార్యదర్శితో మంత్రి హరీశ్‌ భేటి

న్యూఢిల్లీ,జూన్‌ 7(జనంసాక్షి): తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ న్యాయబద్దమైనవేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు.మిషన్‌ కాకతీయ పై  బుధవారం సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్‌ లో మంత్రి హరీష్‌ రావు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. ఎంకే పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌ లో ఉంచారు  .దీన్ని మంత్రి హరీష్‌ సవిూక్షిస్తారు. టెండర్లలో ఎల్‌-1 గా కాంట్రాక్టు పొందిన వారు అయిదు రోజుల్లో అగ్రిమెంట్లు చేసుకోకపోతే వాటిని రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ దిశగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. పలువురు కాంట్రాక్టర్లను  ఇప్పటికే సస్పెండ్‌ చేశారు. మరికొందరిని కూడా సస్పెండ్‌ చేయనున్నారు. ఎం.కె మూడో దశ  పనుల కు చెందిన మొత్తం టెండర్ల ప్రక్రియను డిసెంబర్‌ చివరికల్లా పూర్తి చేయాలని మంత్రి హరీష్‌ రావు ఇదివరకే ఆదేశించారు. మిషన్‌ కాకతీయ టెండర్ల ప్రక్రియలో మరింత పారదర్శకతను పాటించాలని ,పనుల్లో నాణ్యత కోసం టెండర్ల  ప్రక్రియలో సంస్కరణలను ప్రవేశపెట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు అధికార యంత్రాంగాన్ని  సూచిస్తున్నారు.  సెక్రటేరియట్‌ లో మిషన్‌ కాకతీయ మొదటి, రెండో దశల కార్యక్రమాల పై సవిూక్షించనున్నారు. మిషన్‌ కాకతీయ అంచనాలు తయారు చేసినపుడు ప్రామాణీకరణ పాటించాలంటున్నారు.ప్రతిష్టాత్మక మిషన్‌ కాకతీయ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి కోరుతున్నారు. టెండర్ల ప్రక్రియ మొత్తాన్ని మరింత సులభతరం చేయాలన్నారు. మిషన్‌ కాకతీయ పనుల లో అంచనాల నుంచి వాటి మంజూరు వరకు ఆన్‌ లైన్‌ విధానాలను అమలు చేయబోతున్నారు. మిషన్‌ కాకతీయ కు 128 పేజీల టెండర్‌ డాక్యుమెంట్‌ ను 10 నుంచి 15 పేజీలకు  కుదించాలని మంత్రి సూచించారు.దీంతో సమయనీ వృధా కాకుండా చూడవచ్చునని, ఇంజనీర్లపై పనిభారం తగించవచ్చునని మంత్రి సూచించారు. చెరువుల పునరుద్ధరణ పనులను సమర్ధంగా ,నాణ్యతతో పూర్తి చేయడానికి ప్రస్తుతం ఉన్న పద్దతులను సులభతరం చేయాలని మంత్రి సూచించారు. మూడు సార్లు టెండర్లు పిలిచినా  కాంటాక్టర్ల నుంచి స్పందన రాకపోతే  5 లక్షల లోపు పనులను ఆయా గ్రామ పంచాయితీలకే అప్పగించాలన్న ప్రతిపాదనపై కేబినట్‌ నిర్ణయం జరగవలని వుంటుందని మంత్రి హరీష్‌ రావు అన్నారు.  చెరువుల దగ్గర ఎఫ్‌. టి.ఎల్‌. నిర్ధారించి అందుకు తగిన సిమెంట్‌ దిమ్మెలు ఏర్పాటు చేయాలని అధికారులకు గత వీడియో కాన్ఫరెన్స్‌ లో నే ఆదేశించారు.  అలాగే చెరువుల సామర్ధ్యంపై రెవిన్యూ, ఇరిగేషన్‌ రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు.  ఎంకె మొదటి దశ లో చేపట్టిన చెరువులను పునరుద్ధరించిన అనంతరం వాటి నిర్వహణ బాధ్యతలు ఎవరికి వ్యాలన్న అంశంపై బుధవారం మంత్రి చర్చించనున్నారు.కృష్ణానదీ యాజమాన్య బోర్డు, తెలంగాణకు నీటి కేటాయింపులపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీలు, రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు  తెలంగాణ రాష్ట్రం కడుతున్న ప్రాజెక్టులు న్యాయబద్ధమైనవేనని ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కొనసాగకూడదనేదే తమ వాదన అన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై చర్చలకు పిలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆయన ప్రశ్నించారు. తమ వాదనను కేంద్రం  ముందు ఉంచామన్నారు. కృష్ణా బోర్డు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని హరీశ్‌ వ్యాఖ్యానించారు. న్యాయ పోరాటం కోసం అవసరం అయితే సుప్రీంకోర్టు వెళతామని ఆయన స్పష్టం చేశారు.  తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌ ఆరోపణల నేపథ్యంలో కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పనితీరుపై మంత్రి హరీశ్‌రావు, ఇరిగేషన్‌ శాఖ అధికారులు కేంద్రమంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేశారు.