మా భూమి’ వెబ్‌సైట్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ
హైదరాబాద్,ఫిబ్రవరి 17(జనంసాక్షి): మా భూమి సహా రెవెన్యూకు సంబంధించిన 4 వెబ్ పోర్టర్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. నాంపల్లిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మా భూమి వెబ్‌సైన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మా భూమి వెబ్‌సైట్‌లో ఎంతో సమాచారం ఉంది. భూముల గోల్‌మాల్ గురించి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. 2016 సంవత్సరాన్ని రెవెన్యూ శాఖ సంవత్సరంగా పరిగణిస్తం. రెవెన్యూశాఖలోని పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తం. మా భూమి వెబ్‌సైట్ ఇతర శాఖలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. రెవెన్యూ ఉద్యోగులు, ప్రజలకు సేవలు చేసి మొదటి స్థానంలో నిలవాలి. త్వరలో రెవెన్యూ విధానాన్ని ప్రకటిస్తాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినంక భూముల గోల్‌మాల్ తగ్గిందని ఆయన పేర్కొన్నారు.