మా యుద్ధం ఇస్లాంపై కాదు..ఒబామా

2

వాషింగ్టన్‌, ఫిబ్రవరి19(జనంసాక్షి): తమ పోరు ఒక మతంపై కాదని… మతాన్ని తప్పుదోవ పట్టించే వారిపై నిరంతరాయంగా పోరు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పేర్కొన్నారు. సిరియా- ఇరాక్‌లో ఉన్న ఐసీస్‌ స్థావరాలపై అమెరికా సైన్యం దాడులను ఆయన సమర్ధించుకున్నారు. హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కొనే చర్యలపై వైట్‌ హౌస్‌లో జరిగిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇస్లాం పేరుతో ఉగ్రవాదాన్ని సహించబోమన్నారు. ఇరాక్‌, సిరియాలో మారణ ¬మాన్ని ఐసిస్‌ ఉగ్రవాదుల్ని తుదముట్టించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకోసం ఒబామా అమెరికా కాంగ్రెస్‌ మద్దతు కోరారు. హింసాత్మక తీవ్రవాదంపై తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో చర్చిస్తున్నారు. ఐదు రోజుల పాటు జరిగే సదస్సు తొలిరోజున ఒబామా ప్రసంగించారు. ఐసీసీపై దాడులకు ఆయన సమర్థించుకున్నారు. ఏ మతం కూడా  హింసను ప్రోత్సహించదని ఆయన గుర్తు చేశారు. రెండు శతాబ్దాల అమెరికా చరిత్రలో ఎన్నో భద్రతాపరమైన సవాళ్లను సమర్థవంతంగా అధిగమించామని ఆయన అన్నారు. ఐసిస్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.