మిరప రైతులను ఆదుకోవాలి

ఖమ్మం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): జిల్లా వ్యావప్తంగా నష్టపోయిన మిరపరైతులను గుర్తించి వారికి తక్షణ పరిహారం అందచేయాలని న్యూడెమక్రసీ నేతలు డిమాండ్‌ చేశారు. నకిలీ విత్తనాల కారణంగా వారు గత రెండేల్లుగా పూర్తిగా దెబ్బతిన్నారని అన్నారు. దీనికి బాధ్యులైన విత్తన కంపెనీలపై చర్య తీసుకోవాలని అన్నారు. ఈ యేడాది రైతులకు కల్తీ విత్తనాల బాధ తప్పలేదు. ప్రతియేటా ఏదో గ్రామంలో రైతులు కల్తీ విత్తనాలతో నష్టపోతూనే ఉన్నారు. కల్తీ వరి విత్తనాలతో కూడా అనేకమంది రైతులు నిండా మునిగారు. దీంతో రైతులు ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంట అంతా కంకులు వచ్చే సరికి, ముందుగా వచ్చిన వరి కంకులు పూర్తిగా రాలిపోతాయి. దీంతో దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయమై డీలర్‌ను రైతులు ప్రశ్నించగా పట్టించుకోవటంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మిరపలో నకిలీ విత్తనాలే ప్రధానంగా రైతులను దెబ్బతీసాయాని రాష్ట్రస్థాయి తనిఖీ బృందం సభ్యులు స్పష్టం చేశారు. అందువల్ల తాత్కాలికంగా రైతులకు పరిహారం చెల్లించాలని అన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో ఈఏడాది మిరప సాగుచేసిన రైతులు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయారు. వేలాది ఎకరాల్లో సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిరపలో సాధారణంగా కాయలు విడిగా కాపునకు వస్తాయన్నారు. గుత్తులుగా ఉన్నట్లు గుర్తించామన్నారు. విత్తన ఉత్పత్తిదారులపైనా, విక్రయ డీలర్లపైనా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. వారి లైసెన్స్‌ల రద్దుతోపాటు, రైతుల నష్టాన్ని భరించకుంటే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తేనే భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవని అన్నారు.