మిర్యాలగూడెంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
నల్లగొండ: మిర్యాలగూడెంలో ఇంటర్ విద్యార్థి మట్టపల్లి మురళీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కట్టలేదని లెక్చరర్ కళాశాల నుంచి బయటకు పంపించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు మురళీ దామరచర్ల మండలం కల్లపల్లి గ్రామవాసి.