మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు:-
మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ అన్నారు. మిర్యాలగూడను జిల్లాగా చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం వివిధ పార్టీల నాయకులకు వినతిపత్రం సమర్పించారు. ప్రజల అభిప్రాయాన్ని అందరు గౌరవించాలని జిల్లా ఏర్పాటు కోసం జరిగే కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఇస్తామని అన్నారు. జిల్లా ఏర్పాటుకు అవసరమైన వనరులు అవకాశాలు రోడ్లు అన్నీ మిర్యాలగూడకు ఉన్నాయన్నారు. జిల్లా ఏర్పాటు ఉద్యమంలో తాము భాగస్వామ్యం అవుతమన్నారు.అదేవిధంగా టిడిపి జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు,లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు బలిదే వీర ప్రతాప్ రావు, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కంచర్ల అనంత రెడ్డిలకు వినతి పత్రాలు సమర్పించారు కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయకులు తాళ్లపల్లి రవి, రిషికేశ్వర్ రాజు, బంటు వెంకటేశ్వర్లు, చేగొండి మురళి యాదవ్, పోగుల సైదులు గౌడ్, గునగంటి వెంకన్న గౌడ్ ఫారూఖ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.