మిషన్ కాకతీయకు నాబార్డు నిధులు
సీఎంను కలిసిన నాబార్డ్ సీజీఎం
హైదరాబాద్,ఫిబ్రవరి21(జనంసాక్షి): సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నాబార్డ్ సీజీఎం మెమెన్ కలిశారు. మిషన్ కాకతీయకు ఈ ఏడాది రూ. 360 కోట్లు అందిస్తామని కేసీఆర్‌కు మెమెన్ తెలిపారు. వచ్చే ఏడాది రూ. 500 కోట్లు ఆర్థికసాయం అందిస్తామని పేర్కొన్నారు. గ్రావిూణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి నుంచి వాటర్‌గ్రిడ్‌కు రూ. 5 వేల కోట్ల ఆర్థికసాయం చేస్తామని ప్రకటించారు. వాటర్‌గ్రిడ్‌కు ఏడాదికి రూ. వెయ్యి కోట్లు సాయం చేస్తామన్నారు. ప్రాజెక్టును దశలవారీగా చేపట్టాలని సీఎంకు మెమెన్ విజ్ఞప్తి చేశారు. నాబార్డు ప్రతిపాదనలను సీఎం స్వాగతించారు. హైదరాబాద్‌లో నాబార్డు భవనానికి భూమి ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. మార్చి 17న నాబార్డు చైర్మన్‌తో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.ఈ భేటీలో హైదరాబాద్‌లో నాబార్డ్ కార్యాలయం నిర్మాణానికి స్థలం కాటాయించాల్సిందిగా మమ్మెన్ సీఎం కేసీఆర్‌ను కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి స్థలం కేటాయిస్తామని హావిూ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిషన్ కాకతీయ పథకానికి ప్రతీ ఏటా వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. 5వేల కోట్ల సాయం అందిస్తామని నాబార్డ్ మేనేజర్ మమ్మెన్ తెలిపారు. ఈ ఏడాదికి రూ. 360 కోట్లు విడుదల చేస్తామని, వచ్చే ఏడాది రూ. 500 కోట్లు సాయం చేస్తామని ఆయన చెప్పారు. వాటర్ గ్రిడ్‌కు గ్రావిూణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి నుంచి ప్రభుత్వానికి రుణం అందిస్తామని మమ్మెన్ చెప్పారు. ఈ నిర్ణయాలపై సిఎం సానుకూలంగా స్పందించి హర్షం వ్యక్తం చేశారు. ఇందులో మంత్రి హరీష్రావు కూడా పాల్గొన్నారు.