మిషన్‌ భగీరథ దేశానికి ఆదర్శం

5

– 4వేల కోట్ల రుణం

– తెలంగాణతో బంధం కొనసాగుతుంది

– నాబార్డ్‌ స్పష్టీకరణ

హైదరాబాద్‌,జూన్‌ 9(జనంసాక్షి):తెలంగాణతో తమ బంధం ఎంతో కాలం నుంచి కొనసాగుతోందని నాబార్డ్‌ జనరల్‌ మేనేజర్‌ సత్యప్రసాద్‌. తెలంగాణ ప్రజలకు రక్షిత మంచినీటిని అందివ్వాలన్న ప్రభుత్వ సంకల్పానికి నాబార్డ్‌ అండగా ఉంటుందన్నారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు కు ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరాలకు అందించాల్సిన రుణ సహాయంపై పంచాయితీరాజ్‌ స్పెషల్‌ సిఎస్‌ ఎస్పీ సింగ్‌ తో నాబార్డ్‌ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మెదక్‌ జిల్లాలోని గజ్వేల్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, నారాయణఖేడ్‌ సెగ్మెంట్‌ లలో నాబార్డ్‌ నిధులతో  చేపట్టిన పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. పనులు జరుగుతున్న తీరుపై నాబార్డ్‌ ఉన్నతాధికారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా సెగ్మెంట్లకు ఇస్తామన్న 1976.8 కోట్ల రుణసహాయానికి చెందిన రెండో విడత మొత్తాన్ని త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఈ సెగ్మెంట్లలొ జరిగే ఇంట్రావిలేజ్‌ పనులకు కూడా ఆర్థిక సహాయం అందించడానికి నాబార్డ్‌ ముందుకొచ్చింది. మిషన్‌ భగీరథ పై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉందన్న నాబార్డ్‌ జనరల్‌ మేనేజర్‌ సత్యప్రసాద్‌, మిగిలిన కార్యక్రమాల కంటే ఈ పథకానికే తాము ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇక 2016-17 , 2017 ? 18 ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్‌ నిధులతో చేపట్టే పనులపై సమావేశంలో ఓ అవగాహనకు వచ్చారు. 2016-17 ఈ పనుల కోసం 2200 కోట్ల రుణసహాయం అందిస్తామని నాబార్డ్‌ ఉన్నతాధికారులు హామి ఇచ్చారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఖీచిూడజీఎజూ;ూ ఈ.ఎన్‌.సి సురేందర్‌ రెడ్డి, నాబార్డ్‌ ఉన్నతాధికారులు తులికా పంకజ్‌, మూర్తితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.