మిషన్‌ భగీరథ పనుల్లో పురోగతి

ఇంటింటికీ నీరు అందించి తీరుతాం: ఎంపి

ఆదిలాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): గ్రామాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధ జలాన్ని 2019 నాటికి సరఫరా చేయాలన్న సంకల్పంతో పనులు సాగుతున్నాయని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. నల్లా నీరు ఇవ్వకుంటే ఓట్లడగనని సిఎం కెసిఆర్‌ చేసిన వాగ్దానం మేరకు తెంలగాణలో మిషన్‌ భగీరథ పనులుచురుకుగా సాగుతున్నాయని అన్నారు. 20 ఏళ్ల పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉండాలంటే ప్రజలు ఆశీర్వదించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులైఅనేకులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఇకపోతే గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు లేకుంటే ఇండ్ల స్థలాలను కొనుగోలు చేసి అర్హులైన వారందరికీ డబుల్‌బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఇస్తామని ఎంపి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. ఆదిలాబాద్‌జిల్లా కేంద్రంలో రూ.150 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ వైద్యశాలను నిర్మిస్తున్నామన్నారు. నిమ్స్‌ తరహా రోగులకు వైద్యాన్ని అందజేస్తామన్నారు. పేద వారికి కార్పొరేట్‌ స్థాయి విద్యను అందజేస్తామన్నారు. కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలను చేసి కళ్ల అద్దాలను అందజేస్తామన్నారు. హెల్త్‌కార్డులను అందజేసి ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. పెన్‌గంగపై బ్యారేజీ పనులతో పాటు పంప్‌హౌస్‌ పనులు చకచక కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వే సిందన్నారు. రైతునురాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమై న విద్యను అందిస్తారన్నారు. ప్రతి విద్యార్థిని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు ఆకర్షితులై గ్రామ గ్రామాన పెద్ద సంఖ్యలో ఆయా పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు.

 

తాజావార్తలు