మిషన్ భగీరథ నీటి విషయమై రసాభాస.

కోటగిరి జూన్ 21 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం రోజున ఎంపీపీ సునిత శ్రీనివాస్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల పరిధిలోని పలు ప్రభుత్వ శాఖల పనితీరుపై అధికారులకు,ప్రజా ప్రతినిధుల మధ్య పలు అంశాలపై సమీక్ష సమావేశం పై చర్చోపచర్చలు జరిగాయి.మొదటగా వ్యవసాయ శాఖ పనితీరుపై సమావేశం ప్రారంభించగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మండలంలో భౌగోళిక సాగు విస్తీర్ణంలో భాగంగా సాగైన పంటలపై వారు మాట్లాడారు.ఈ సందర్భంగా ఎంపీటీసీ కొట్టం మనోహర్ స్పందిస్తూ గత రభి పంట సాగు విషయమై పంట మార్పిడి విధానం పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.ప్రభుత్వం పరంగా రైతులకు సరైన రీతిలో సబ్సిడీపై విత్తనాలు,ఎరువులు లభించడం లేదన్నారు.అలాగే వర్షాకాలం సాగు ప్రారంభం కావస్తున్న ఇప్పటి వరకు 9 వ విడత రైతు బంధు ఉసే లేదన్నారు.తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల తాగు నీటి అవసరాల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ భగీరథ పథకంపై సంబంధిత అధికారుల పనితీరుపై అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు,ప్రతిపక్ష పార్టీ ప్రతినిధుల మధ్య వాదోపవాదాలు జరిగాయి.ఈ సందర్భంగా ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ..మిషన్ భగీరథ నీటి విడుదలలో భాగంగా కుళాయి ద్వారా మట్టి,మురికి రూపంలో నీరు రావడం విషయమై సంబంధిత అధికారులను ప్రశ్నించగా అర్.డబ్ల్యు.ఎస్ అధికారులు స్పందిస్తూ మిషన్ భగీరథ పైప్స్ లీక్ అయినప్పుడు,సింగూర్ వద్ద నీటి ఫిల్టరింగ్ ప్రాసెసింగ్ లో ఏర్పడిన టెక్నికల్ సమస్యల వల్ల ఇలాంటి సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు.

బస్వాపూర్ గ్రామ సర్పంచ్ కోలి రేఖ మాట్లాడుతూ గ్రామంలో అక్రమంగా విద్యుత్ కనెక్షన్ల బెడద తీవ్ర రూపం దావిస్తున్న సందర్భంగా గ్రామంలో గొడవలు జరుగుతున్నాయి.అలాగే గత కొన్ని రోజుల క్రితం గ్రామంలో నెలకొన్న డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రవేశమై గ్రామంలో తీవ్ర అలజడితో కూడిన గొడవ వాతావరణం నెలకొన్నది.కావున సంబధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు ఇట్టి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని సర్పంచ్ ఈ సందర్భంగా కోరారు.అలాగే విద్యా,పౌర సరఫరాల,గృహ నిర్మాణ,పంచాయతిరాజ్ ఇంజనీర్,ఇందిరక్రాంతి,విద్యుత్,అర్.డబ్ల్యు.ఎస్,ఆరోగ్య,వైద్య శాఖల పనితీరుపై అధికారులు, ప్రజాప్రతినిధులకు మధ్య సమీక్ష సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శంకర్ పటేల్,వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్,జిల్లా కో ఆప్షన్ సభ్యులు సిరాజ్,ఎంపిడిఓ అతరుద్దిన్,ఆయా గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.