మిషన్ భగీరథ నీరు స్వచ్ఛమైన అమృతం. అర్.డ.బ్ల్యు.ఎస్ డి.ఈ వెంకశ్వర్ రెడ్డి.
కోటగిరి జూలై 21 జనం సాక్షి:-నీటిలోని లవణాల శాతం,క్లోరినేషన్ పక్రియ,నీటి పి.ఎచ్ లెవెల్స్, టి.డి.ఎస్ పర్సంటేజ్ వంటి అంశాలపై మిషన్ భగీరథ అధికారులు కోటగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులకు,పంచాయతి సిబ్బందికి గురువారం రోజు టెస్టింగ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అర్.డ.బ్ల్యు.ఎస్ డి.ఈ వెంకశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..నేటి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలందరూ తాగే నీటి విషయంలో అశ్రద్ద వహిస్తున్నారు.ప్రజలందరు మిషన్ భగీరథ నీటినే ఎల్లవేళలా త్రాగి ఆరోగ్యంగా ఉండాలని కొరారు.నేటి జీవన విధానంలో అందరు ఫిల్టర్ నీటికి అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.ఈ ఫిల్టర్ నీటిలో ఒక వ్యక్తికి అవసరమైయే లవణాలు సరియైన మోతాదులో ఉండడం లేదన్నారు.కానీ మిషన్ భగీరథ నీటిని అన్ని విధాలా పరీక్షల అనంతరం ప్రజలకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు.అనంతరం మిషన్ భగీరథ నీరుకి,ఫిల్టర్ నీటికి మధ్య ఉన్న లవణాల శాతాన్ని ల్యాబ్ టెక్నీషియన్ తో టెస్ట్ చేయించి వివరించారు.కావున ప్రతి ఒక్కరు మిషన్ భగీరథ నీటిని త్రాగి ఈ నీటిలో సరైన మోతాదులో ఉండే కాల్షియం,మెగ్నీషియం తదితర లవణాలు పొందగలరని సూచించారు.ఈ కార్యక్రమంలో అర్.డ.బ్ల్యు.ఎస్ డి.ఈ వెంకశ్వర్ రెడ్డి,ధనరాజ్,స్థానిక సర్పంచ్ పత్తిలక్ష్మణ్,పోతంగల్ సర్పంచ్ వర్ని శంకర్,కులకర్ణి అనిల్,కూచి సాయిబాబా,కోటగిరి గ్రామ సిబ్బంది,ల్యాబ్ టెక్నీషియన్ భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.