మీడియాపట్ల అప్రజాస్వామికంగా వ్యవహరించం
నేడు ప్రెస్ అకాడమీలో జర్నలిస్టులతో సమావేశం
విధివిధానాల రూపకల్పనపై చర్చ
తెరాస సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన
సీఎం కేసీఆర్
హైదరాబాద్,ఫిబ్రవరి20(జనంసాక్షి): విూడియాపై ఆంక్షలు విధింఛనున్నారని వస్తున్న వార్తలు నిజం కాదని అయితే దీనిపై ఒక పద్ధతి ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. దీనిపై ఈ మధ్యాహ్నం 2గంటలకు ప్రెస్ అకాడవిూలో జర్నలిస్టులతో సీఎం సమావేశం కానున్నారు. పాత్రికేయులకు సంబంధించిన అంశాలపై నేరుగా చర్చించనున్నారు. జర్నలిస్టులకు సంబంధించిన అంశాలపై వారితో సీఎం నేరుగా చర్చించనున్నారు. కొందరు అధికారులు, మంత్రుల సూచనల మేరకు తెలంగాణ సచివాలయంలో విూడియా ప్రతినిధుల ప్రవేశంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రింట్, ఎలక్టాన్రిక్ విూడియా ప్రతినిధులను అనుమతించరాదంటూ సూతప్రాయ నిర్ణయం తీసుకుంది. భద్రతపరమైన సమస్యలపై ఇంటెలిజెన్స్ నివేదిక; ఇబ్బందులు కలుగుతున్నాయంటూ కొందరు మంత్రులు, అధికారులు చేసిన ఫిర్యాదులను అనుసరించి అనుమతుల నిషేధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు విూడియా సమావేశాలు నిర్వహించినప్పుడే విలేకరులను పిలుస్తారు. సమావేశాలు ముగిసిన వెంటనే వెనక్కి పంపించేస్తారు. విూడియా ప్రతినిధులు నిత్యం ఛాంబర్ల వద్ద ఉండడం వల్ల రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతోందని సీఎంకు మంత్రులు, ముఖ్యకార్యదర్శులు ఫిర్యాదుచేశారు. సచివాలయానికి ఎవరు వచ్చినా వారు సీఎంను కలిసి చర్చించారనే తప్పుడు వార్తలు ఇస్తున్నారని ఫిర్యాదుచేశారు. ఇటీవల ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో చాలా మంది అధికారులు విూడియా ప్రతినిధులతో పడుతున్న బాధలను వెల్లడించారు. విూడియాపై ఇంటెలిజెన్స్ అధికారులు సీఎంకు నివేదిక సమర్పించారు. ఈ నేపధ్యంలో మీడియా ప్రతినిధులను సచివాలయంలోకి అనుమతించే విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక మరోవైపు తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందని కేసీఆర్ అన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారనటానికి సభ్యకత్వ నమోదే ఉదాహరణ అని అన్నారు. ప్రజల ఆశీసులతో మున్ముందు మరిన్ని ప్రజాసంక్షేమ పథకాలు అమలుచేస్తామన్నారు.