మీరు రిక్వెస్ట్ లెటరిస్తే నీటి విడుదలపై ఆలోచిస్తాం
సాగర్ డ్యాం పగులగొడతామంటే చూస్తూ ఊరుకోం
మంత్రి హరీశ్
హైదరాబాద్,ఫిబ్రవరి13(జనంసాక్షి): సాగర్ జలాల విషయంపై ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్ లెటర్ ఇస్తే నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుందని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సాగర్ డ్యాం పగుల గొడతామంచే చూస్తూ ఊరుకోమన్నారు. ఎపి ప్రభుత్వం ఇప్పటికే వాటాకు సాగర్ నుంచి నీటిని వాడుకుందని తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. అయినా ఉన్ననీటిలో ఇరు రాష్టాల్ర రైతుల పంటలను కాపాడుకోవడానికి సిద్దమన్నారు. గతంలో లాగా బుల్‌డోజ్ వ్యవహారాలను ఇక సహించమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. నాగార్జునసాగర్ డ్యాం ఏపీ సొమ్ము కాదు. డ్యాం పగులగొడతామంటే చూస్తూ ఊరుకోమని హరీశ్‌రావు అన్నారు. సాగర్ కుడి కాలువకు నీటి విడుదల విషయంలో డ్యాం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమై మంత్రి మట్లాడుతూ ఏపీ వ్యవహారశైలి నోటితో నవ్వి నొసలుతో వెక్కిరించినట్లుగా ఉంది. ఏపీ ప్రభుత్వం సాగర్ నీటి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది. ఏపీకి 322.611 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు ఉంది. కానీ ఇప్పటికే 365.75 టీఎంసీల నీటిని వాడుకుంది. అంటే 43.13 టీఎంసీల నీటిని ఏపీ అదనంగా వాడుకుంది. అదే తెలంగాణకు 229.9 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు ఉంది. ఇప్పటిదాకా తెలంగాణ వాడుకుంది కేవలం 140.4 టీఎంసీల నీరు మాత్రమే. ఇంకా 89.511 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు ఉంది. నల్లగొండ జిల్లాలో 2 లక్షల ఎకరాలు సాగు అవుతోంది. ఖమ్మం జిల్లాలో మొదటి పంట అయిపోయిందని ఈ పంటలను కూడా కాపాడాల్సిఉందన్నారు. డ్యాం వద్ద రెచ్చగొట్టేలా మాట్లాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మా పంటలు ఎండిపోవద్దు.. విూ పంటలు ఎండిపోవద్దు. సర్దుబాటు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏపీ హుద్ హుద్ తుపాన్ భారిన పడినప్పుడు సీఎం కేసీఆర్ తక్షణం స్పందించి విద్యుత్ పరికరాలను అందించారు. కానీ మా దగ్గర కరెంట్ లేక పంటలు ఎండిపోయి రైతులు చనిపోతున్నా ఏపీ ప్రభుత్వం కనికరించలేదని మంత్రి పేర్కొన్నారు. లిఖిత పూర్వక ప్రతిపాదనలతో వస్తే పంటల కోసం మరో ఐదు లేదా పది టిఎంసిల నీటిని విడుదల చేయడానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు. ఇరిగేషన్ అదికారులతో కలసి ఆయన శుక్రవారం సాయంత్రం విూడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నాగార్జున్‌సాగర్ జలాశయంలో 63 టీఎంసీల నీరు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. లేని హక్కుల కోసం ఏపీ ప్రభుత్వం పాకులాడుతోందన్నారు. ఇప్పటికే ఏపీ 43.13 టీఎంసీల నీరు అదనంగా వాడుకున్నదని… అయినప్పటికీ ఏపీలో పంటలు కాపాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ఆంధప్రదేశ్ ప్రభుత్వం స్పష్టంగా రాతపూర్వకంగా ఎన్ని టీఎంసీలు కావాలో అడిగితే ఇస్తామన్నారు. 5, 6 టీఎంసీల నీటిని ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇరు రాష్టాల్ర రైతులు నష్టపోకుండా ఉండాలన్నదే తమ అభిమతమన్నారు. తెలంగాణకు 229.9 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు ఉందని తెలిపారు. నాగార్జున సాగర్ నీటిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు సవిూక్ష చేసినఅనంతరం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అదనంగా నీటిని వాడుకుందని టి.సర్కార్ నిర్ధారణకు వచ్చింది. అయితే ఏపీ సర్కారు.. ఇప్పటివరకు ఎన్ని టీఎంసీల నీటిని వాడుకుంది.. ఇంకా ఎన్ని టీఎంసీల నీరు అవసరమో రాతపూర్వకంగా కోరితే సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. నాగార్జున సాగర్ నీటిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు సవిూక్ష చేసిన అనంతరం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అదనంగా నీటిని వాడుకుందని టి.సర్కార్ నిర్ధారణకు వచ్చింది. అయితే ఏపీ సర్కారు.. ఇప్పటివరకు ఎన్ని టీఎంసీల నీటిని వాడుకుంది.. ఇంకా ఎన్ని టీఎంసీల నీరు అవసరమో రాతపూర్వకంగా కోరితే సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు.