ముంపు గ్రామాల బాధితులకు బండి సంజయ్ చేయూత

బియ్యం, నిత్యవసర సరుకులు అందజేత

*బాధితులతో ఫోన్లో మాట్లాడిన ఎంపీ

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :

గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల బాధితులను ఆదుకోవడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ తన వంతు చేయూతనందించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ఎంపీ బండి సంజయ్ కుమార్ తన వంతు సహాయ సహకారాలు అందించడానికి సొంత ఖర్చులతో స్థానిక బిజెపి శ్రేణుల ద్వారా శనివారం ముంపు గ్రామాల బాధితులకు నిత్యవసర సరుకులు బియ్యం, వంట సామాగ్రి, కూరగాయలుపంపిణీ చేయించారు. నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల బాధితులతో ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఫోన్లో మాట్లాడి పరామర్శించి తగిన భరోసా కల్పించి ధైర్యంగా ఉండాలని సూచించారు. రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజల సమస్యను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితులు అందరికీ తగిన న్యాయం చేయడానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. అకాల వర్షాలపై, నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీసిన ఎంపీ బండి సంజయ్ కుమార్ స్థానిక బిజెపి శ్రేణులకు తగిన దిశా నిర్దేశనం చేసి బాధితులకు అండగా నిలిచారు. ముఖ్యంగా వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఇస్తారుపల్లి గ్రామ ప్రజలను ఆదుకోవడానికి ఎంపి బండి సంజయ్ వెంటనే స్పందించి, మూడు రోజుల క్రితం పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులందరికీ దుప్పట్లు పంపించి, భోజనం ఏర్పాట్లు చేయించారు. తమను ఆదుకోవడానికి ముందుకు వచ్చి , నిత్యవసర వస్తువులు అందజేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్ కి ముంపు గ్రామాల బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక బిజెపి శ్రేణులు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ఎంపీ బండి సంజయ్ కుమార్ గత నాలుగు రోజులుగా ఎప్పటికప్పుడు నారాయణపూర్ రిజర్వ్ ముంపు గ్రామాల పరిస్థితి ప్రమాదం గురించి తెలుసుకున్నారని, కష్టకాలంలో ఎల్లవేళలా ప్రజలకు బిజెపి శ్రేణులందరూ అందుబాటులో ఉండే విధంగా చేసి, బాధితులకు కావలసిన తగిన ఏర్పాట్లు ఎంపీ బండి సంజయ్ చేయడం హర్షనీయమన్నారు.
ఇట్టి కార్యక్రమంలో దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బాల్ రెడ్డి ,మాజీ ఎంపీటీసీ పెరిక శ్రావణ్ , బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మోతే శ్రీహరి , మండల ప్రధాన కార్యదర్శి గుండారపు మధు ,మండల ఉపాధ్యక్షులు గుండెలు, మల్లేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు దేశెట్టి శ్రీనివాస్ ,ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మేకల హరిబాబు , పోలింగ్ బూత్ అధ్యక్షులు రుద్రాక్ష శ్రీనివాస్ శ్రీపతి చారి , మల్లేశం, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవల్లి రాము కార్యకర్తలు అనిల్ ,మనోజ్ రాజు ,తదితరులు పాల్గొన్నారు