ముక్కును ముక్కుకు రాస్తూ..

4

– ప్రణబ్‌కు సాంప్రదాయ స్వాగతం

న్యూజిలాండ్‌,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): రెండు దేశాల పర్యటనకు వెళ్లిన ప్రణబ్‌ పపువా న్యూ గునియా నుంచి శనివారం మధ్యాహ్నం న్యూజిలాండ్‌ వెళ్లారు. అక్కడ ఆక్లాండ్‌ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయనకు ఘన స్వాగతం లభించింది.ఈ సందర్భంగా అక్కడి వీరుల తెగ అయినటువంటి ‘మావోరి’ రాష్ట్రపతి ప్రణబ్‌ ముందు విచిత్ర విన్యాసాలు చేసింది.న్యూజిలాండ్‌ సంప్రదాయాలు అద్దం పట్టేలా మావోరీ పద్ధతిలో ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ప్రత్యేక వస్త్ర ధారణలో అక్కడున్న మావోరీ వారియర్స్‌ ప్రణబ్‌ను ఆహ్వానిస్తూ నృత్యాలు చేశారు. అనంతరం వావోరీ వారియర్స్‌కి చెందిన ఓ పురుషుడు, ఓ మహిళ రాష్ట్రపతి ముక్కుకు తమ ముక్కును రాసి స్వాగతం పలికారు. ఇద్దరి మధ్య స్నేహానికి ప్రతీకగా వారి సంప్రదాయంలో అలా చేయడం ఆచారంగా వస్తోందట. ఒళ్లు గగుర్పొడిచేలా కర్రసాములాంటిది చేస్తూ అప్పుడప్పుడు గట్టిగా అరుస్తూ వారి కళను ప్రదర్శించింది. అనంతరం ఆ తెగ నాయకుడు ప్రణబ్‌కు గౌరవ వందనం చేశారు. పలువురు సైనికుల మాదిరి కవాతు నిర్వహించారు. చివరిగా ఆ తెగ పెద్ద, అతడి భార్య వారి

సాంప్రదాయం ప్రకారం ప్రణబ్‌ ముఖర్జీ ముక్కుకు తమ ముక్కులను రాస్తూ కరచాలనం చేస్తూ స్వాగతం పలికారు. అంతకుముందు వీరు పాటలు పాడుతూ చిందులు కూడా

వేశారు.ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత న్యూజిలాండ్‌ గవర్నర్‌ జనరల్‌ సిర్‌ జెర్రీ మటెపరే.. ప్రణబ్‌ని అక్కడి గవర్నమెంట్‌ హౌస్‌కి తీసుకెళ్లారు.