ముక్కోటి దర్శనానికి సిద్దమైన భద్రాద్రి
భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
భద్రాచలం,డిసెంబర్17(జనంసాక్షి): భద్రాచలంలోని రామాలయం ముక్కోటి శోభను సంతరించుకుంది. వైకుంఠాన్ని మైమరిపించేలా ఆలయ పరిసరాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రాచల దివ్యక్షేత్రం ముక్కోటి ఏకాదశి మ¬త్సవాల వేళ దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ముక్కోటికి భక్తుల రాకను, విఐపిల రాకను దృష్టిలో పెట్టుకుని భారీఆ ఏర్పాట్లు చేశారు. దివిలో వైకుంఠం భువిపై ప్రత్యక్షమైందా అన్నరీతిలో ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి మ¬త్సవాల నేపథ్యంలో దక్షిణ అయోధ్య కలియుగ వైకుంఠంగా దర్శనమిస్తోంది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమవగా తొలి పది రోజుల పాటు పగల్‌పత్తు ఉత్సవాలను నిర్వహించారు. ఈ సమయంలో స్వామి వారు దశావతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. తెప్పోత్సవానికి గోదావరి తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. హంసాలంకృత లాంచీపై శ్రీ సీతారామచంద్రస్వామికి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. అలాగే శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారంలో శ్రీ సీతారామచంద్రస్వామి మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రామాలయంలో జరిగే పూజల్లో ఎక్కువ భాగం తమిళనాడులోని శ్రీరంగం ఆలయం తరహాలో జరుగుతాయి. అక్కడ ముక్కోటి ఏకాదశిని ఎప్పుడు నిర్వహిస్తున్నారన్నది ఇక్కడి వైదిక పెద్దలు తెలుసుకుని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైష్ణవ సంప్రదాయంలో పూర్తి నిబద్ధతతో అన్ని లెక్కలను పరిగణలోకి తీసుకుని ముక్కోటి ఏకాదశిని నిర్వహిస్తున్నారు. వేలాదిగా తరలిరానున్న భక్తులు, విఐపి లకోస ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శుక్రవారం తెల్లవారు జామునుంచే వైకుంఠద్వారం ద్వారా దర్శనం కల్పిస్తారు. ఇందుకోసం ఆర్జిత సేవలను నిలివేశారు. ఏకాదశి, ద్వాదశి దర్శనాలకు అనుమతిని ఇస్తారు. ఇందులో భాగంగా గురువారం సాయంకాలపు సంధ్యా సమయంలో సీతమ్మవారితో కలిసి రాములవారు జలవిహారం చేస్తారు. మరుసటి రోజు స్వామివారు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. ఈ మ¬త్సవ వేడుకలకు దేశం నలుమూలల నుంచి భక్తులు భద్రాచలానికి వస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది.