ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలి – సీపీఐ డిమాండ్
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేసి డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని మండల తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. ఈసందర్బంగా మండల ఇంచార్జి కర్రెప్ప మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి, సమక్షేమం కొరకు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలోప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుదన్నారు. అదేవిధంగా పెరుగుతున్నటువంటి నిత్యవసర వస్తువుల ధరలను అరికట్టడంలో విఫలమైతున్నారు. ధరల పెరుగుదల వలన ప్రజాల జీవనం అస్తవ్యస్తమవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలను నాలుగుసంవత్సరాలు పూర్తి అయినా నేటికీ అమలు చేయ కపోవడం శోచనీయం దీనిని నిరసిస్తూ ఈ క్రింది డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ CPI రాష్ట్ర సమితి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త గా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా ఇక్కడ పై సమస్యల పైన కార్యక్రమాన్ని నిర్వహించి ఈ క్రింది డిమాండ్ ను నెరవేర్చాలని తహసీల్దార్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని తెలిపారు..
డిమాండ్స్ అర్హత కలిగిన అందరికీ సొంత జాగాలో ఇల్లు నిర్మించుకొనుటకు ఐదు లక్షలు తక్షణమే ఇవ్వాలి. లక్ష రూపాయల వరకు రుణమాఫీని తక్షణం అమలు చేయాలి..57 సంవత్సరాల పూర్తి అయిన వారికి అందరికీ మళ్ళీ తక్షణమే దరఖాస్తు చేసుకోవటానికిఅవకాశం ఇచ్చి ఇంతవరకు చేసుకున్న వారితో పాటు పెన్షన్లు ఇవ్వాలి, ఇతర సామాజిక పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా తక్షణం పెన్షన్లుఇవ్వాలి నూతన పెన్షన్ల మంజూరులో పెట్టినటువంటి అనేక నిబంధనలను రద్దు చేయాలి.. ధరణి పోర్టల్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి అసైన్డ్ భూములను విరాసత్ (వారసులకుపట్టా మార్పిడి) చేయుటనుతక్షణమే ప్రారంభించాలి..నూతన రేషన్ కార్డులను ఇవ్వాలి…రాజకీయ జోక్యం లేకుండా అర్హత కలిగిన వారికి దళిత బంధు ఇవ్వాలి..స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.. పోడు భూములు సాగు చేసుకుంటున్నా గిరిజనులతో పాటు ఎస్సీ, బీసీలకు పట్టాలు ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు చెల్లించవలసిన నిధులను తక్షణమే చెల్లించాలని తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన తెలిపిన అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కి ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో డి రంగన్న,నవీన్, తిమ్మారెడ్డి, రంగారెడ్డి, విజయ్,హరిజన నర్సప్ప ,వెంకటన్న, నరసింహులు, తిమ్మప్ప, వెంకటేష్, రాములు, బీమన్న, వీరేష్ తదితరులు పాల్గొన్నారు..
|