ముఖ్యమంత్రి కేసీఆర్ కు వీఆర్ఏల గోస పట్టదా!

– కుంభకర్ణుడు వేశంలో ఉన్న వ్యక్తికి వినతిపత్రం సమర్పణ
– కుంభకర్ణుడు వేశంలో ఉన్న వ్యక్తికి వినతిపత్రం సమర్పణ
మునగాల, ఆగస్టు 10(జనంసాక్షి): స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో గత పదిహేడు రోజులుగా నిరవధిక సమ్మెను చేపట్టిన వీఆర్ఏలకు ప్రముఖ సామాజిక కార్యకర్త వేమూరి సత్యనారాయణ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కుంభకర్ణుడు వేశంలో ఉన్న వ్యక్తికి వీఆర్ఏలకు సంబంధించిన వినతులతో కూడిన వినతి పత్రాన్ని వినూత్న పద్ధతిలో గురువారం సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ, వీఆర్ఏలు గత 17 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ నిరవధిక సమ్మెను చేపట్టారని, అయినా గాని ముఖ్యమంత్రి కెసిఆర్ కుంభకర్ణుడులాంటి నిద్రను వీడట్లేదని, అంతేగాక ప్రభుత్వ పాలకులకు నిమ్మకు నీరేత్తిన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగా లక్షలకు లక్షలు జీతాలు వీఆర్ఏలు ఏమి అడగటం లేదని, వారికి కేవలం  చట్టపరంగా ఇవ్వాల్సిన ప్రతిఫలాలను ప్రభుత్వం ఎందుకు అందజేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఏమోగానీ ఉన్న ఉద్యోగాలకు శని దాపురించిందని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ ఊదరగొట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏల కనీస డిమాండ్లు ఎందుకు పరిష్కరించడం లేదని అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు రాబోతున్న వేళ ప్రభుత్వాలు వజ్రోత్సవాలు అని నిర్వహిస్తుంటే.. మరోపక్క ఈ భారతావనిలో ఈ వజ్ర ఉత్సవాల వేల వీఆర్ఏలు తమ జీవితాల బాగుకై రెవెన్యూ కార్యాలయాల ముందు ఇలా టెంట్లు వేసుకుని నిరసన సమ్మెను చేపట్టడం ముమ్మాటికి ప్రభుత్వ అసమర్థత పాలననే కారణం అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో వీఆర్ఏల జేఏసీ నాయకులు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.