ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా నర్సాపూర్ మండల ఇన్చార్జిగా మెదక్ ఉమ్మడి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం

సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి  , ఆగస్టు 16  :

మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గంలోని బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు.

ఈ సమావేశంలో మెదక్ ఉమ్మడి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్   పట్నం మాణిక్యంకు నర్సాపూర్ మండలం ఇన్చార్జి గా  ఇవ్వడం జరిగింది .

పట్నం మాణిక్యం  స్థానిక ఎమ్మెల్యే తో మరియు ముఖ్య కార్యకర్తలతో చర్చించి బాధ్యత తీసుకున్నారు.

ఈ సందర్భంగా పట్నం మానికే మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నందున బహిరంగ సభకు భారీ ఎత్తున కార్యకర్తను సమీకరించాల్సిన అవసరం ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మల్లి కేసీఆర్ ని ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు, అమలు చేస్తున్న విధానాలను గ్రామస్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలకు వివరించాలన్నారు. సీఎం సభను దిగ్భ్యం చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి గారు, పట్నం మాణిక్యం డిసిసిబి వైస్ చైర్మన్ గారు, మెదక్ జిల్లా బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.