ముగిసిన కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రత్యేక పూజలు..

మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో గల ప్రముఖ ఆదివాసీల ఆరాధ్య దైవం… నాగోబా ఆలయ  పున: ప్రతిష్టాపన కార్యక్రమాలు.. తేదీ 12- 12-2022 నుండి 18- 12- 2022 వరకు  ఈరోజుతో ముగిశాయి.. 2017న ఆలయ పునర్  నిర్మాణానికి మేస్రం  వంశీయులు నిర్ణయించుకోవడం.. మెస్రం వంశీయులు ఆలయం పునర్ నిర్మాణం కోసం   తమ వంశీయుల ప్రతి గడప గడప నుండి సొంతంగా సుమారు ఐదు కోట్ల నిధులు సేకరణ చేయడం జరిగింది. ఆదివాసి సంస్కృతి ఉట్టిపడేలా ఆలయ  నిర్మాణం జరిగింది. నాగోబా ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలతో కేస్లాపూర్ లో పండగ వాతావరణం నెలకొంది.. ఈ కార్యక్రమానికి అశేష ఆదివాసీ ప్రజలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరియు మధ్య ప్రదేశ్,ఛత్తీస్ ఘడ్ నుండి మెస్రం వంశీయులు రావడం  జరిగింది…ఈ ముగింపు కార్యక్రమానికి  ఎమ్మెల్సీ దండేవిటల్,ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, కమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ కోవా లక్ష్మి, మాజీ మంత్రి గోడం నాగేష్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు.