ముగిసిన మూడోదశ ప్రచారం

గ్రామాల్లో జోరుగా ఎన్నికల ¬రు

ఖర్చుకు వెనకాడకుండా పోటీ

ఖమ్మం,జనవరి28(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ మూడో దశ ఎన్నికల ప్రచారం సోమవారం సాయత్రం ముగియనుండడంతో జోఉగా ప్రచారం చేపట్టారు. ఇంటింటిక వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. 30న జరుగున్న ఎన్నికల్లో నిలబడ్డ అబ్యర్థులు ఖర్చుకు వెనకాడకుండా ప్రచార¬రు చేపట్టారు. మూడో దశలో జిల్లాలోని రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, చింతకాని మండలాల్లో ఎన్నికలు

నిర్వహించనున్నారు. మూడో దశలో 7 మండలాల్లోని 192 గ్రామ పంచాయతీలకు గాను 24 గ్రామ పంచాయతీల సర్పంచి పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 168 పంచాయతీ సర్పంచి స్థానాల్లో 410 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1740 వార్డు స్థానాల్లో 245 వార్డులకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. మిగతా 1495 వార్డు స్థానాల్లో 3290 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరంతా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయం ఆయా మండలాల్లో మద్యం దుకాణాలు మూసేయాలని ఇప్పటికే కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుండగా మంగళవారం ఆయా మండల కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్‌ పత్రాలు సహా ఎన్నికల సామగ్రి అప్పగించే అదే రోజు రాత్రికి పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఆ వెంటనే ఉప సర్పంచి ఎన్నిక నిర్వహిస్తారు. కేవలం సర్పంచి పదవిని అందుకోవాలనే మోజుతో ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారు. ఊహించని విధంగా ఆశావహులు ఖర్చు పెట్టారు. నిత్యం మందు, విందు కోసం లక్షలాది రూపాయల్ని వెచ్చిస్తున్నారు.