*ముద్ద చర్మ వ్యాధి రాకుండా పశువులకు వ్యాధి నిరోధక టీకా
లింగంపేట్ 22 అక్టోబర్ (జనంసాక్షి)
లింగంపేట్ మండలంలోని నల్లమడగు తండాలో శనివారం ఆవులు,దూడలకు ముద్ధ చర్మ వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగిందని వైద్యులు రవి కుమార్ తెలిపారు.తండాలోని 250 ఆవులు,దూడలకు చర్మ వ్యాధులు సోక కుండ ముందు జాగ్రత్తగా చర్యగ వ్యాధి నిరోధక టీకాలు వేసామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విఏ రవి గోపాలమిత్ర యజాస్,రమేష్ తండావాసులు పాల్గొన్నారు.