మునిపల్లి మండలంలో ప్రారంభమైన పీఆర్టీయూ సభ్యత్వ కార్యక్రమం

 

మునిపల్లి, ఆగస్టు 09, జనంసాక్షి : 2023 సంవత్సరానికి సంబంధించి పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘ సభ్యత్వ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్ ఆద్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పాఠశాలల్ని సందర్శిస్తూ ఉపాధ్యాయులని కలిసి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా మండల అధ్యక్షులు చంద్రమౌళి,ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కరించేందుకు పి ఆర్ టీ యూ ఉపాధ్యాయ సంఘం నిరంతరం కృషి చేస్తుందని ఇప్పటి వరకు ఉపాధ్యాయులు పొందుతున్న ఎన్నో సదుపాయాలని పి ఆర్ టీ యూ సంఘం సాధించి పెట్టిందని తెలిపారు.ప్రస్తుతం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సీపీఎస్ రద్దు, ప్రమోషన్ లు బదిలీలు, అతిత్వరలో ప్రభుత్వాన్ని ఒప్పించి ఐ ఆర్ తో పాటు నూతన పి ఆర్ సీ ఇప్పించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వాన్ని ఒప్పించే చొరవ పి ఆర్ టీ యూ కి తప్ప ఇతర సంఘాలకు లేదని, ఉపాధ్యాయుల శ్రేయస్సుకోసం నిరంతరం కృషిచేసే తమకు మండలంలోని ఉపాధ్యాయులనుండి మంచి మద్దతు లభిస్తుందని సభ్యత్వం తీసుకుని సహకారం అందించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.ఉపాధ్యాయులు భద్రత ని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం నుండి క్రియాశీలక సభ్యత్వం కలిగిన ఉపాధ్యాయులందరికి లక్ష రూపాయల భీమా సదుపాయం కూడా కల్పించడం జరిగిందని తెలిపారు.ఈ నాటి సభ్యత్వ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్,మండల అధ్యక్షులు చంద్రమౌళి,మండల ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ జిల్లా ,మండల కార్యవర్గ నాయకులు వీరన్న,రాజేశ్వర్,శ్రీకాంత్, సుజాఉద్దీన్, సిద్దేశ్వర్, ప్రవీణ్ కుమార్,రమేశ్,దేవదానం,కిష్టయ్య,ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.