మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్

       కొండమల్లేపల్లి అక్టోబర్ 18 జనం సాక్షి : మునుగోడు ఉప ఎన్నికలో  గులాబీ జెండా ఎగరడం ఖాయం రెండు, మూడు స్థానాల‌కు కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య గ‌ట్టి పోటీ 22వేల కాంట్రాక్టు ఇస్తారనే బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్న మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
మునుగోడులో గులాబీ జెండా ఎగరడం ఖాయం అని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు .మంగళవారం నాంపల్లి మండలం లక్ష్మపురం గ్రామంలో ఇంటింటికీ ప్రచారం కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు పాల్గొని కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. వచ్చేనెల 3న జరుగనున్న మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను అభర్ధించారు. కాంట్రాక్టు కోసం కక్కుర్తి పడి బీజేపీలో చేరి మునుగోడు నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి ఉపఎన్నికల్లో ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. 22వేల కాంట్రాక్టు ఇస్తారనే కమిట్మెంట్ తో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని ఆయన ఆరోపించారు.  ఉప ఎన్నికలో గెలిచేందుకు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బరితెగింపునకు పాల్పడుతున్నారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు రూ. 500 కోట్లు ఖర్చు చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం ఉందని శుక్రవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్‌లో వెల్లడించారని అన్నారు. బీజేపీ ఎంత ఖర్చుపెట్టినా గెలవదని ఆయన చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందడం ఖాయమని, రెండు, మూడు స్థానాల‌కు కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంద‌ని ఆయ‌న అన్నారు. టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టి  పకడ్బందీగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి చైతన్యపర్చాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశా, నిర్దేశం చేశారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్వలాభం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీ మారారని విమర్శించారు.వ్యవసాయ రంగంలో అద్భుతాలను సృష్టించాలనే ఉద్దేశంతో కేసీఆర్ అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంఛార్జీ గా కొనసాగుతూ విశేష సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు.
రైతుల్లో నవచైతన్యానికి సీఎం కేసీఆర్ నాంది పలికారు. రైతు బంధు పథకం ద్వారా ప్రభుత్వం ఎకరాకు రూ.10వేలు పంట సాయం అందిస్తున్నదని రైతులను చైతన్యపరిచారు. అన్నదాత మృతి చెందిన వారం రోజుల్లో రైతు బీమా పథకం ద్వారా  చనిపోయిన రైతు కుటుంబానికి సర్కారు రూ.5 లక్షలు అందజేస్తున్నదని గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.  రైతులు పండించిన పంటకు మార్కెటింగ్, గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేశారు.  వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా వ్యవసాయ రంగానికి కీలకంగా మారనున్న సాగునీరు, విద్యుత్, పెట్టుబడి సాయం,విత్తనాలు, ఎరువుల సాయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో సుదీర్ఘంగా చర్చించి సమస్యల పరిష్కారంపై తనదైన ముద్ర వేశారు.  మిషన్ భగీరథ పథకం ద్వారా అడుగంటిన 45వేల చెరువుల పునరుద్ధరణ కోసం కృషి చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ గురించి అన్నదాతల్లో చైతన్యం పెంచారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు రూ.24,205 కోట్లు ఇవ్వాలని నితి అయోగ్ సిఫారసు చేసినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్  పేరును భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చేశారు. దేశ రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించనున్నారని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్  ప్రకటన అనంతరం దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోందన్నారు. రాజకీయంలో పెను ప్రకంపనలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు కేసీఆర్ కు మద్దతుగా నిలిచారని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షుడు ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి, కంకణాల వెంకట్ రెడ్డి, ఏడుదొడ్ల ప్రభాకర్ రెడ్డి,ఎంపీటీసీ రమేష్,దొంతం చంద్రశేఖర్ రెడ్డి,గున్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,వింజమూరి రవి తదితరులు పాల్గొన్నారు.
Attachments area