మునుగోడులో ముసలోళ్ళతో ములకతైన రసమయి

శంకరపట్నం, జనం సాక్షి, అక్టోబర్ 21, మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ ప్రచారం ఎక్కడ చేసిన అందరికీ భిన్నంగా ఉంటుంది….మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ నియోజకవర్గంలోని చండూరు మండలంలోని ధోని పాముల,జోగిగూడెం తిమ్మారెడ్డిపల్లె లో గ్రామ గ్రామాన పలకరిస్తూ ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ఉదయాన్నే ముసలోళ్ళతో మూలాకతై వారి సాధకబాధకలను తెలుసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అలాగే జోగిరెడ్డి గూడెంలో టిఆర్ఎస్ నాయకుడు మంగ దొడ్డి లింగయ్య గురువారం అనారోగ్యంతో మృతి చెందగా , మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. లింగయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అనంతరం రసమయి మాట్లాడుతూ…
మునుగోడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్క రోజైనా నియోజకవర్గంలో కనబడలేదని ఎద్దేవా చేశారు. కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థంతో తన కాంటాక్ట్ కోసం మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు. ప్రజలు ఓటేసి గెలిపిస్తే వారి సమస్యలను పట్టించుకోకుండా తన పనులను చక్కదిద్దుకోవడానికే రాజగోపాల్ రెడ్డి తన అధికారాన్ని వాడుకున్నాడని మండిపడ్డారు. మళ్లీ రాజగోపాల్ రెడ్డి ని గెలిపిస్తే తన కాంట్రాక్టుల కోసం పనిచేస్తాడు తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేయడని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి మీరు ఎందుకు ఓటు వేయాలని నియోజకవర్గ అభివృద్ధి కోసం కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.