మునుగోడు ఇంటింటి ప్రచారంలో రాజంపేట్ మండల రైతు బంధు అధ్యక్షులు జూకంటి మోహన్ రెడ్డి

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 22
 మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్న గారి ఆదేశాల మేరకు రాజంపేట్ రైతుబంధు మండల అధ్యక్షులు జూకంటి మోహన్ రెడ్డి తెరాస అభ్యర్థి అయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం మునుగోడు మండలం పులిపలుపుల గ్రామం లో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలను కలిసి మీ అమూల్యమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు అదేవిధంగా భారత దేశంలోనే ఎక్కడలేని అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలియజేశారు మీ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలి అప్పుడే మునుగోడు అభివృద్ధి చెందుతుందని ప్రజలకు తెలియజేశారు తమ సొంత లాభాల కోసం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకొని మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు దాదాపు నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదు కానీ కొన్ని వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకొని ఆయన ఆయన కుటుంబ సభ్యులు మాత్రం అభివృద్ధి చెందుతున్నారు కావున నియోజకవర్గ ప్రజలు అందరు గమనించి మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి ప్రజల పక్షాన నిలబడి పార్టీ రైతాంగం కోసం రైతన్న పక్షాన నిలబడ్డ పార్టీ మహిళల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీని గెలిపించి మన సత్తా చూపించగలరా అని ప్రజలతో కోరారు
Attachments area