మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం- జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని చండూరు గ్రామంలో శుక్రవారం శంషాబాద్ జెడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్ తో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల అభ్యున్నతి కొరకు కృషి చేస్తున్నారన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు వృద్ధులకు, వితంతువులకు 250 ఉన్న పెన్షన్ను 2016 రూపాయలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు. ఎన్నికల సమయంలోనే కనిపించే బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మి మోసపోవద్దు అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ప్రతి ఒక్కరు ఓటు వేసి మరోసారి టిఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలన్నారు.
ఈ కార్యక్రమంలో శంషాబాద్ జెడ్పీటీసీ నీరటీ తవ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : చండూరులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్న జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి జెడ్పిటిసి నీరటి తన్విరాజు.