మునుగోడు ఎన్నికల్లో పద్మశాలీల సత్తా చూపిస్తాం.

పద్మ పీఠం పొలిటికల్ ఆర్గనైజేషన్ ఫౌండర్ కొక్కుల భాస్కర్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 25 (జనంసాక్షి). తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏ రాజకీయ పార్టీ పద్మశాలీలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై పద్మ పీఠం పొలిటికల్ ఆర్గనైజేషన్ ఫౌండర్ కోక్కల భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మునుగోడు పద్మశాలి సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు. మునుగోడులో 40 వేలకు పైగా పద్మశాలీలు ఉన్నారని ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పద్మశాలి అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో పద్మశాలీల సత్తా ఏమిటో చూపిస్తామని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో తమ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కమిటీలు వేసి రాజకీయంగా పద్మశాలీలను చైతన్యవంతం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేసి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. సమావేశంలో మునుగోడు పద్మశాలి సంఘం నాయకులు మాజీ ఎంపీటీసీ చెరుకు మల్లయ్య, మాజీ సర్పంచ్ చెరుకు జనార్ధన్, వెంకటేశ్వర్లు బత్తిని నాగభూషణం కోడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు