మునుగోడు ప్రచారంలో బెల్లంపల్లి ఎంపీపీ.
బెల్లంపల్లి, అక్టోబర్22, జనంసాక్షి.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గట్టుప్పల్ మండల బాధ్యతలు స్వీకరించడంతో ఆయనకు అండగా షేరు గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మద్దిగుడా గ్రామంలో టీఆరెస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరుపున ఇంటింటికి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆరెస్ విజయానికి రాచబాటలు వేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచులు నరసింహ, గుర్రాల రాయమల్లు, బెల్లంపల్లి టీఆరెస్ నాయకులు వెంకటేష్ గౌడ్, కలాలి వెంకటేష్, కలాలి భీమయ్య తదితరులు పాల్గొన్నారు.